09:56 AM, 3 Wednesday March 2021

పశువులకు సంక్రమించే వ్యాధుల పట్ల సకాలంలో వైద్యం వెంటనే చేయించాలి

ఆలమూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రైతులు  పశువులకు సంక్రమించే గర్భకోశ వంటి పలు వ్యాధుల పట్ల సకాలంలో స్పందించి తగిన వైద్యం చేయించుకోవాలని మండల పశు వైద్యులు భానుప్రకాష్ సూచించారు.  మండలం పరిధిలో మడికి గ్రామం పశు వైద్యశాల వద్ద శుక్రవారం పశు సంవర్ధక శాఖ ఏడీఏ ఓ రామకృష్ణ ప్రారంభించిన పశువైద్య శిబిరంలో ఆయన స్థానిక పశు వైద్యుడు మల్లవరపు రామకృష్ణతో కలిసి పలు పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత పశు వైద్య శిబిరానికి మల్లావానితోట, చిలకలపాడు, మడికి గ్రామాల నుండి సుమారు150 పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం  ఉచితంగా మందులను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తోరాటి సూర్యప్రకాశ్ పలువురు పశువైద్యులు రైతులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#