– ఉచిత మందుల పంపిణీ చేస్తున్న మండల పశువైద్యులు భాను ప్రసాద్
ఆలమూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
పశువులకు సోకే సీజనల్ వ్యాధుల పట్ల పాడి రైతులు అప్రమత్తంగా ఉండి సకాలంలో వైద్యం చేయించాలని మండల పశు వైద్యాధికారి జి భాను ప్రసాద్ అన్నారు. మండలం పరిధిలో చొప్పళ్ల పశు వైద్యశాల వద్ద శనివారం ఉచిత పశు వైద్య శిబిరంరాని పశు సంవర్ధకశాఖ ఏడీఏ ఓ రామకృష్ణ ప్రారంభించారు. ముఖ్యంగా పశువులకు సోకే గర్భ కోసం వ్యాధి వంటి వాటికి వైద్యపరీక్షలు నిర్వహించి రైతులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాడి రైతులు పాల్గొన్నారు