ఆత్రేయపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
కొళాయి నుంచి వస్తున్న బురద నీరు అంటూ న్యూస్ పేపర్లు టీవీ న్యూస్ లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు. ర్యాలీ గ్రామంలో రజక వీధి లో కుళాయి నుంచి వస్తున్న మురికి నీరు బురద, కథనం పేపర్ న్యూస్ ఈటీవీ లో రావడంతో అధికారులు హుటాహుటిన స్పందించారు. పంచాయతీ కార్యదర్శి కృష్ణ స్పందించి కొత్తపేట ఆర్ డబ్ల్యు ఎస్ విజయ్ కుమార్ , ఆత్రేయపురం అసిస్టెంట్ ఇంజనీర్ రామకృష్ణారెడ్డికి సమాచారం అందించి పైప్ లైన్ కుళాయిలు మంచి నీటిని పరిశీలించగా పైప్ లైన్ లీకేజ్ బురద నీరు లాక్కొంటున్నా లీకేజీ గుర్తించి వాటర్ పైపు లైన్ బాగు చేయించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైప్ లైన్ కొద్దిపాటి లీకేజ్ కావడంతో బురద నీరు లాక్కోవడం జరిగిందని దాని గురించి బాగు చేశామన్నారు. అలాగే మంచినీళ్లు తెల్లగా రావట్లేదని గ్రామస్తులు వివరించగా వాటిని కూడా పరిష్కరించే విధంగా వాటర్ శాంపిల్స్ కూడా సేకరించి బాటిల్ లో పట్టి పరిశోధనకు పంపడం జరుగుతుందని వాటర్ తేడా ఉంటే బోర్ పైపు కూడా మార్పించి కార్యక్రమం చేపడతామని అధికారులు తెలిపారు.