04:13 PM, 28 Thursday January 2021

పాత కక్షల నేపథ్యంలో దంపతులపై కత్తులతో దుండగులు దాడి

– చికిత్స పొందుతూ భర్త సూర్యనారాయణ రెడ్డి మృతి
– భార్య పరిస్థితి విషమం
– డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం

పెదపూడి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

పెదపూడి మండలం,గొల్లల మామిడాడలో పాత కక్షలతో దంపతులపై కత్తులతో దుండగులు మంగళవారం దాడికి పాల్పడ్డారు. చికిత్సపొందుతూ భర్త సూర్యనారాయణ రెడ్డి మృతి,భార్య పరిస్థితి విషమం గొల్లల మామిడాడ లో ఒక హత్య కేసులో ఏ1 నిందితుడు సూర్యనారాయణరెడ్డి బెయిలుపై రిలీజ్ అయ్యి ఇంటి వద్ద ఉండడంతో, పాత కక్షలతో కొంతమంది గుర్తు తెలియని దుండగులు, సూర్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద ఉన్న సమయంలో ఇంటిలోకి ప్రవేశించి కత్తులతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించగా, అతని భార్య అడ్డు రావడంతో ఆమెను సైతం కత్తులతో దాడి చేసి పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమీప పెదపూడి ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కాకినాడ గవర్నమెంట్ హాస్పటల్ కు బాధితులను తరలించారు.చికిత్స పొందుతూ సూర్యనారాయణ రెడ్డి హాస్పిటల్ లోనే మరణించగా,అతని భార్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం.ఈ హత్య ఘటనతో గొల్లలమామిడాడ గ్రామంలో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#