01:47 AM, 8 Monday March 2021

పిఆర్ టియూ నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ

నరసరావుపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రొంపిచర్ల మండల విద్యా వనరుల కేంద్రం లో మంగళవారం పిఆర్ టియూ నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఇఓ కె. పి. బాబురెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై  ఉపాధ్యాయసంఘం పిఆర్ టియూ చేస్తున్న ఉద్యమాలు  మరువలేనివని అన్నారు. పిఆర్ టియూ నూతన సంవత్సర డైరీ లో పొందుపరిచిన జిఓలు ఉపాధ్యాయులకు ఉపయోగకరముగా ఉన్నాయని అన్నారు. బదిలీలపై మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు పిఆర్ టియూ నాయకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పిఆర్ టియూ మండల నాయకులు అబ్దుల్ సత్తార్ రవి మోజెస్ రఫి వకుళాదేవి వెంకటేశ్వరరావు బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#