05:00 PM, 3 Wednesday March 2021

పిచుకలపాడు , ఫెర్గుసన్ పేట గ్రామాల్లో పోలీసుల కవాతు

– ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల పరిశీలన
– ఎటపాక సీఐ గీతారామకృష్ణ , ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా మండల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలైన పిచుకలపాడు , ఫెర్గుసన్ పేట తదితర గ్రామాల్లో బుధవారం ఎటపాక సీఐ గీతా రామకృష్ణ , ఎస్సై జ్వాలాసాగర్ ఆధ్వర్యంలో సి/39 సీఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బందితో కవాతు నిర్వహించారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను సీఐ , ఎస్సైలు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు గురించి గ్రామ వాలంటీర్లను వారు ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఐ గీతారామకృష్ణ మాట్లాడుతూ ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని , ఎన్నికల నిర్వహణకు ప్రజలంతా సహకరించాలని అన్నారు. గతంలో జరిగిన ఎన్నికల మాదిరిగానే గ్రామాల్లోని ఓటర్లంతా ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని , ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా రాజ్యాంగ బద్ధమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల దృష్ట్యా పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని సీఐ గీతారామకృష్ణ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎవరైనా అల్లర్లు , అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా , ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్టు తెలిసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఓటర్లు మద్యం , నగదు వంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సూచించారు. నాటుసారా , గంజాయి వంటి మత్తుపదార్దాలను రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ , ఎస్సైలు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సి/39 సీఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#