08:15 PM, 25 Thursday February 2021

పుట్టకుండ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా

– సర్పంచ్ అభ్యర్థి మేడిశెట్టి వీరవెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు

పెదపూడి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి, నామినేషన్లు ప్రక్రియ పెదపూడి మండలంలో జోరందుకున్నాయి. మండలంలో పుట్టకుండ గ్రామంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మేడి శెట్టి వీర వెంకట సత్యనారాయణ  శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టకుండ గ్రామంలో ప్రజలందరి మద్దతుతో నామినేషన్ వేయడం జరిగిందన్నారు. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆశీస్సులతో సంపర గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులంతా తనాకు ఓటు వేసి గెలిపిస్తే పుట్టకుండ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, నియోజకవర్గంలోనే ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పుట్టకుండ గ్రామ ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#