12:55 AM, 2 Tuesday March 2021

పూర్తి అవగాహనతోల ఎన్నికల ప్రక్రియ

– జిల్లా కలెక్టర్ జె.నివాస్

శ్రీకాకుళం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

పూర్తి అవగాహనతో  ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారుమొదటి విడత  పంచాయతీ ఎన్నికలపై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత మండల అభివృధ్ధి  అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.  ముందుగా  బ్యాలట్ బాక్సులను సిధ్ధంగా వుంచుకోవాలన్నారు.  డిజిటల్ అసిస్టెంట్లను నియమించుకుని వార్డువారీగా దాఖలయిన నామిమేషన్ వివరాలను రోజువారీ అప్ లోడ్ చేయాలన్నారు.  కులాలవారీగా రిజర్వేషన్ల నిక్కచ్చి వివరాలను రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు పంపించాలన్నారుఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలన్నారుఅభ్యర్ధులకు ఇవ్వవలసిన నిర్ణీత ఫారాలనుప్రోఫార్మాలను అందించాలన్నారుపోలింగ్ స్టేషన్లను పరిశీలించుకోవాలన్నారు.  ఉదయం 6.30 గం. నుండి పోలింగ్ ప్రారంభం కానున్నదన్నారునామినేషన్ల అనంతరం విత్ డ్రాయల్స్స్కూటినీరిజెక్షన్లుఅభ్యర్ధుల  తుది జాబితాల వివరాల తయారీ తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి వుండాలన్నారు.  పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సరిగా చేయాలన్నారుపోలింగ్ కేంద్రాలను పరిశీలించాలనిరూట్ మేప్ లు పక్కాగా తయారు చేయాలని ఆయన ఆదేశించారుఅవసరమైన వాహనాలను ఏర్పాటుబేలెట్ పేపర్ల పంపిణీలో ఎటువంటి తప్పిదాలు జరగరాదని ఆయన స్పష్టం చేశారుఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారునామినేషన్ దాఖలు చేసే ప్రదేశాలను ముందుగా తెలియజేయాలని చెప్పారువీడియో కెమెరాలువెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మొదటి విడతలో పాతపట్నంటెక్కలిఎచ్చెర్ల నియోజక వర్గాలలోని 10 మండలాలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  లావేరుకొత్తూరుహిరమండలంపాతపట్నంమిలియాపుట్టిఎల్.ఎన్.పేటకొటబొమ్మాళిసంతబొమ్మాళిటెక్కలినందిగాం మండల పరిథిలలోని 319 గ్రామ పంచాయితీలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, 2902 వార్డులలో, 2940 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల జరగనున్నాయని తెలిపారు.  కావున బ్యాలట్ బాక్సులుపోలింగ్ మెటీరియల్ఓటరు లిస్టులు పక్కాగా  వుండాలన్నారు.  ఎన్నికలు సజావుగా నిక్కఛ్ఛిగా జరగాలన్నారు.   ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహనతో నిర్వహించాలన్నారు

 సమావేశంలో సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులుజిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధిజిల్లా పంచాయితీ అధికారి వి.రవిమండల అభివృధ్ధి అధికారులు..పి.ఆర్.ఆర్.డి.లుతదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#