03:19 AM, 8 Monday March 2021

పూల తోటలపై వచ్చు తెగుళ్లను ముందే గుర్తించండి.

– హార్టీకల్చర్ హెచ్ఓ సుధీర్ కుమార్.

ఆలమూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రైతులు పూలచెట్లపై వచ్చు తెగుళ్లను ముందే గుర్తించి వాటి  రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం (కడియం) హార్టీకల్చర్ హెచ్ఓ డి సుధీర్  కుమార్ అన్నారు. మంగళవారం నాడు  మండలం పరిధిలో బడుగువానిలంక, మడికి, మూలస్థానం అగ్రహారం, చొప్పెల్ల లంకల్లో “తోట బడి” కార్యక్రమంలో భాగంగా రైతులు సాగు చేస్తున్న పూలతోటలను వారు ఆయా గ్రామాల ఉద్యాన వన సహాయకులుతో కలిసి క్షేత్రస్థాయిలో పూల తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం చామంతి పూలతోటలపై  కోడిపేను ఆశించే ప్రమాదం ఉందని దాని నివారణకు జిగురు అట్టలను మొక్కకు ఒక అడుగు భాగంలో పసుపు, నీలం రంగుతో ఎకరాకు నలభై అట్టలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే పూల పంట రక్షణ కొరకు చేను చుట్టూ రక్షణగా జొన్న, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేసుకోవాలని తెలిపారు.  అలాగే పంట రక్షణ కొరకు పలు రకాల మందులు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన సహాయకులు పి వెంకటలక్ష్మి , గ్రామవాలంటీర్లు పలువురు రైతులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#