శ్రీకాకుళం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
శనివారం ఉదయం పెద్దపాడు ఉన్నత పాఠశాలను ఉప విద్యాశాఖ అధికారిని ఆర్. విజయ్ కుమారి సందర్శించారు, ఈ సందర్శనలో భాగంగా పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులపై పరిశీలించారు పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు, అనంతరము పదో తరగతి విద్యార్థుల తో కాసేపు పాఠ్యాంశాలపై చర్చించారు అనంతరం ఆమె పాఠశాలలో జరుగుతున్న బోధన పై సంతృప్తి వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఉప విద్యాశాఖ అధికారిని తో ఈ పాఠశాలలో కొన్ని సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు అందులో భాగంగా ఈ పాఠశాలలో ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 6 గదులు లోనే పాఠ్యాంశాలను బోధిస్తున్నారు ఈ పాఠశాలలో సుమారుగా ప్రాథమిక పాఠశాలలో 250, ఉన్నత పాఠశాలలో 230 వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు ఈ సంఘటన పట్ల ఉపాధ్యాయుల విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం పై ఇబ్బంది పడుతున్నారు అని వివరించారు, ఉప విద్యాశాఖ అధికారి ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని , త్వరలోనే జిల్లా విద్యాశాఖ అధికారులతో కూడా సమస్యలు వివరిస్తారని కూడా తెలిపారు, చివరగా ఆమె ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించడం పై సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అయినా మక్కా. శ్రీనివాసరావు , పాఠశాల ఉపాధ్యాయులు అయినా పి.సత్యవతి, యం . శాంతారావు, జి. భూషణ రావు, డి . ఎం. మల్లేశ్వరి, ఎస్ . ఎల్ . శివ జ్యోతి, ఏ. మాధవి భాయ్, పీ. వీ. జీ . లక్ష్మి, జె. లలిత, కె . సురేష్, వ్యాయామ ఉపాధ్యాయుడు జి . మోహన్, ఆర్ట్ ఉపాధ్యాయుడు సి. హెచ్ . రవి కుమార్, క్రాఫ్ట్ ఉపాధ్యాయుని బి. త్రివేణి, విద్యార్థులు , విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు.