05:03 PM, 3 Wednesday March 2021

పెద్దాడ లో చివరి రోజు జోరుగా ఎన్నికల ప్రసారం

– బ్రహ్మరథం పట్టిన ఓటర్లు

పెదపూడి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలం పెద్దడ గ్రామంలో ఎన్నికల ప్రసారం ఆకరి రోజు ఆదివారం జోరుగా సాగింది. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు ఆధ్వర్యంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి డోకు బుర్ర మీనాక్షి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు పత్తిపాటి భద్ర రావుమాట్లాడుతూ పెద్దాడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారని, గత యాభై రెండు సంవత్సరాల నుంచి పెద్దాడ గ్రామంలో గ్రామ ప్రజలందరూ ఒకే మాటపై నిలబడి ఏకగ్రీవంగా సర్పంచ్, వార్డులు ఎన్నికలు జరిగేవని, అయితే  కొంచెం మంది వ్యక్తుల వల్ల సర్పంచ్ ఎన్నికలు జరగడానికి కారణమైందన్నారు. గత యాభై రెండు సంవత్సరాలుగా ఏకగ్రీవంగా ఉన్న గ్రామాన్ని కొంత మంది నామినేషన్ వేసి ఘనకార్యం చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. తమ గ్రామంలో అంతా ఏకధాటిగా ఉన్నారని ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా డోకు బుర్ర మీనాక్షిని గ్రామ ప్రజలందరూ గ్రామ సర్పంచ్ గా గెలిపించుకుంటాం అని, అలాగే 12మంది వార్డు నెంబరులను, గ్రామ సర్పంచ్ ని మంచం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైసిపి నాయకులు పత్తిపాటి భద్ర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#