02:20 AM, 24 Sunday January 2021

పెయింటర్ అబ్బులు కి చేయూత సంస్థ చేయూత …

– చేయూత వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం. రవి కుమార్..

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

వివిధ ప్రమాదాల్లో గాయపడిన ముప్పై రెండు కుటుంబాల వారికి వైద్య సహాయం అందజేసినట్లు చేయూత వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం. రవి కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రమైన రాయవరం గ్రామానికి చెందిన యార్లగడ్డ అబ్బులు డబ్బులు కుటుంబానికి చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు. గత సంవత్సర కాలం క్రితం అబ్బులు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అప్పటినుంచే మంచానికి పరిమితం అయ్యాడు. అతని కుటుంబం ఆదుకునేందుకు చేయూత స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం రవి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ సంస్థ గ్రామాల్లో తమ వంతు సమాజ సేవ చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో పంతొమ్మిది వందల మంది సభ్యులు ఉండగా, మన తూర్పుగోదావరిలో 1200 మంది సభ్యులు ఉన్నారు. తమ సంస్థ ద్వారా ఇప్పటివరకు వివిధ ప్రమాదాల్లో గాయపడిన ముప్పై రెండు కుటుంబాల వారికి వైద్య సహాయం అందజేశామన్నారు. అలాగే కరోనా సమయంలో ప్రతిరోజు ఒక లక్ష పదిహేడు వేల మంది కి ఆహారం అందజేశామన్నారు. సుమారు ఐదువేల మందికి నిత్యవసర సరుకులు అందజేసినట్లు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో 1,257 యూనిట్ల రక్తాన్ని సేకరించి తలసేమియా తో బాధపడుతున్న చిన్నారులకు, గర్భవతులకు వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారికి అందజేసినట్లు రవి కుమార్ తెలిపారు. తోలతగా యార్లగడ్డ అబ్బులు కుటుంబానికి సంస్థ తరఫున 35 వేల రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ మహమ్మద్ అలీం, గోడితి మురళీకృష్ణ, దరగ సీతారత్నం, మదర్ తెరిసా యూత్ అధ్యక్షుడు సి. హెచ్ సంజీవ్ రాజు, ఉపాధ్యక్షుడు దువ్వ చంద్రశేఖర్, జాన్,తులసి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#