03:23 AM, 8 Monday March 2021

పెళ్లి అయిన రోజునే ఇంటి కోసం దరఖాస్తు చెయ్యండి

90 రోజుల్లో క్రొత్త దంపతులకు ఇల్లు మంజూరు చేసి జగనన్న కానుకగా అందిస్తాం : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ. శ్రీ రంగ నాథ రాజు…

ఆచంట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

అర్హత ఉంటేచాలు ప్రభుత్వ పథకాలు ఇంటికే చేరతాయి , ఇది ముఖ్యమంత్రి మంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ప్రజా పాలన అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ.శ్రీ రంగ నాథ రాజు అన్నారు.ఆచంట మండలంలో వల్లూరు , భీమలాపురం, కరుగోరుమిల్లి, కందరవల్లి ,పెనుమంచిలి, కోడేరు గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు 614 మందికి ఇండ్లపట్టాలను మంత్రి వర్యులు మంగ వారం సాయంత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో మంత్రి మాట్లాడుతూ ఆరోజు జగనన్న పాదయాత్రలో మహిళల ఆవేదనను అర్థం చేసుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు రూ 68 వేల కోట్లు ,68.361 ఏకరాలు 30 లక్షల 75 వేల 755 మంది ఇళ్లులేని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం చేపట్టి అమలు చేస్తున్నామని, ఇళ్ల స్థలాల పంపిణీ లో పేదరికమే అర్హతగా చూశామని మంత్రి అన్నారు. కులం,మతం, పార్టీలకు,వర్గాలు అతీతంగా నిక్షపక్తపాతంగా, పూర్తి పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని మంత్రి అన్నారు. గతంలో ఇంటి స్థలం కోసం ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షణలు చేసినా ఒక వర్గంకు అందే పట్టాలు ఇప్పుడు అధికారులు నిరుపేదలు ఇంటికి వెళ్లిమరీ ఇస్తున్నారని మంత్రి అన్నారు. ఇంటిపట్టా తీసుకుని ఇంటి స్థలం స్వయంగా చూసుకుంటున్న లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం అంతాఇంతా కాదన్నారు. ఎంతో భావోద్వేగాలకు గురై ఆనందభాష్పాలు రాలుస్తున్నారన్నారు అని మంత్రి అన్నారు. ఇతర పార్టీలకు చెందినవారు కూడా పట్టాలు పొంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని , ఇది ఒక చరిత్రాత్మకం అని మంత్రి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేదలకు స్థలాలు ఇవ్వాలని ఏర్పాటు చేసిన స్థలంలో ఆయన మరణించిన తర్వాత పట్టించుకునే నాదుడు లేక ఇప్పుడు అవే స్థలంలో ఇళ్ల స్థలాలు ఆయన కొడుకు శ్రీ వై .ఎస్. జగన్మోహన్ రెడ్డి కొన్ని చోట్ల ఇవ్వడం ఒక విధి అని మంత్రి అన్నారు. ప్రతీ లబ్ధిదారునికి ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన శాంక్షన్ పత్రాలు కూడా ఇస్తున్నామని , ఎవ్వరి మనోబావాలకు అనుగుణంగా ఇల్లు నిర్మించు కోవచ్చునని మంత్రి అన్నారు. అంతేకాకుండా ఇళ్లు పూర్తయ్యే నాటికి రోడ్లు, డ్రైన్స్, విద్యుత్ వంటి నివాసానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించి కాలనీలు అందంగా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు.ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఒక్కటే అర్హులైన ప్రతి పేదవారికీ ఇల్లు ఇవ్వాలి. కుటుంబం తో హాయిగా జీవించాలి అని , ప్రజలంతా సంతోషంగా ఉండాలి అనేది ఆయన తపన , అశయం అని మంత్రి అన్నారు.ఉగాది నాటికి ఇండ్ల గృహ ప్రవేశాలుకు శ్రీకారం చుట్టాలని , రానున్న కాలంలో ముఖ్య మంత్రి పర్యటనలో ఇల్లు లేనివారు ఎవ్వరైనా ఉన్నారా చేతులు ఎత్తాలనీ అడిగితే ఏ ఒక్క చెయ్యి ఎత్తని రీతులో ఇల్లు నిర్మింస్తామని మంత్రి తెలిపారు .నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను మీరు భోజనం చేసిన తర్వాత తీరికఉంటే ఒక్క క్షణం ముఖ్య మంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి నీవు ఏ తల్లికన్న బిడ్డవో ఎంతోమందికి ధైర్యాన్నిచ్చే ఇంతమంచి కార్యక్రమం చేపట్టావు ఎక్కడఉన్నా నీవు చల్లగా ఉండాలని మాత్రం ముఖ్యమంత్రి ని దీవించాలని మంత్రి శ్రీ రంగ నాథ రాజు లబ్ధిదారులను కోరారు.భారత దేశ చరిత్రలోనే ఇంత అద్భుతమైన కార్యక్రమం ఎప్పుడూ జరిగి ఉండలేదని, నేను గతంలో అత్తిలి శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పేదలకు ఇళ్ళు కట్టి ఇచ్చామని ఆ ఇల్లు ఈ రోజున రూ 15 లక్షలు నుండి రూ 20 లక్షలు విలువ చేస్తాయని మంత్రి అన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని అది ఇప్పుడు సాధ్యమైనదని నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆ శాఖ మంత్రి గా ఉండుట పూర్య జన్మ సుకృతం అని ఇంత అవకాశం ఇచ్చిన ఆచంట నియోజకవర్గం ప్రజల కు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేనిది అని మంత్రి శ్రీ రంగ నాథ రాజు అన్నారు.

ఈ సమావేశంలో తశిల్దార్ శ్రీ ఏ.మధుసూదన రావు ,డి. ఇ.ఇ శ్రీ కె.వెంకటరావు, నాయకులు శ్రీమతి మామిడిశేట్టి.కృష్ణ వేణి, శ్రీ సుంకర.సీతా రామ్, శ్రీ చెల్లెం.ఆనంద్ ప్రకాష్ ,శ్రీ వైట్ల.కిషోర్, శ్రీ ముప్పాళ్ల.వేంకటేశ్వర రావు,శ్రీమతి నీతిపూడి.భాగ్య వతి,శ్రీ మట్టా.ఆనంద్ కుమార్, తది తర వివిధ శాఖలు అధికారులు,వివిధ గ్రామాలు నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#