08:38 PM, 1 Monday March 2021

పెళ్ళిలో చోడవరం సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం

– సీఎం జగన్ తోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన
– చోడవరం వైకాపా సర్పంచ్ అభ్యర్థి పొడియం.మణి

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

సీఎం జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందని చోడవరం వైకాపా సర్పంచ్ అభ్యర్థి పొడియం.మణి పేర్కొన్నారు. వార్డు పర్యటనల్లో ప్రచారంలో భాగంగా ఆమె శనివారం వైకాపా పార్టీ శ్రేణులతో కలిసి చోడవరం గ్రామపంచాయతీలోని ఎర్రగట్టులో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పెళ్లిలో నూతన వధూవరుల సమక్షంలో వినూత్న ప్రచారం గావించారు. 17న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో చోడవరం వైకాపా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను ఆమె అభ్యర్ధించారు. తనను గెలిపిస్తే జిల్లా డిసిసిబి చైర్మన్ అనంత ఉదయ్ భాస్కర్ (బాబు) , ఎమ్మెల్యే నాగులపల్లి.ధనలక్ష్మి సహకారంతో గ్రామపంచాయతీలో పూర్తి స్థాయిలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడతానని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసును గెలుచుకున్నారని ఆమె పేర్కొన్నారు. కాబట్టి తనను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ముఖ్యమంత్రి బాటలోనే గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తానని సర్పంచ్ అభ్యర్థి మణి పేర్కొన్నారు. వార్డుల పర్యటనకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు , స్థానిక ఎంపిటిసి ఎలమోలు రమేష్ , ఘంటసాల.రవి , కర్రి.శంకర్ , ఏపూరి. విజయ్ , కంగాల.శ్రీను , పొడియం.నాగేశ్వరరావు , పేరాల.సత్యనారాయణ , పేరాల.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#