01:55 AM, 24 Sunday January 2021

పేదల సొంత ఇంటి కల ముఖ్య మంత్రి జగన్ వల్లనే సాధ్యం

● ఆర్థిక అసమానతలు లేని ప్రభుత్వము బండారులంక  ఇళ్ళ పట్టాల పంపిణీ 
– మంత్రి విశ్వరూప్

అమలాపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు లేకుండా కులమతాలకు అతీతంగా పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. మంగళవారం అమలాపురం రూరల్ మండలం బండారులంకలో 475 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ  రాష్ట్రంలో 32 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన ఘనత  దేశ చరిత్రలో ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని మంత్రి అన్నారు. ఇళ్ళ పట్టాలు ఇవ్వటమే కాకుండా ఇంటి నిర్మాణానికి లక్ష 80 వేలు ఇస్తున్నారని, ఇల్లు కట్టుకోలేమని అనుకుంటే ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని ఇటువంటి వెసులుబాటు గతంలో ఎన్నడూ చూసి వుండలేదని మంత్రి తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పాలన సువర్ణాక్షరాలతో లిఖించతగ్గదని మంత్రి కొనియాడారు. రాబోయే రోజుల్లో కూడా జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా వుంటే పేద కుటుంబాలకు మరెన్నో మేలైన కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి తెలియ చేసారు. గత ఐదు సంవత్సరాల కాలంలో బండారు లంక లో ఏ నిరుపేదలకు ఒక్క ఇండ్ల స్థలం ఇచ్చిన దాఖలాలు లేవని, కనీసం పది లక్షలతో ఒక్క సి.సి రోడ్డు కూడా వేయలేదని మంత్రి చెబుతూ తాను 2009 లో శాసనసభ్యునిగా  వచ్చినప్పుడు 17 వందల మందికి అంత్యోదయ కార్డులు ఇవ్వడం జరిగిందని, అలాగే ఒక కోటి 50 లక్షలతో సిసి రహదారులు వేయడం జరిగిందని మంత్రి తెలిపారు. మండలంలో పదవ తరగతి లో అత్యధిక ఉత్తీర్ణత,టాప్ ర్యాంక్ లు వచ్చే బండారు లంక కు టెన్త్ క్లాస్ సెంటర్ కూడా తాను తీసుకు రావడం జరిగిందని మంత్రి తెలియచేశారు. పాఠశాల కు పంపే ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకం ద్వారా ముఖ్య మంత్రి రూ.15 వేల ఇస్తున్నారని మంత్రి తెలిపారు. అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ మాట్లాడుతూ అమలాపురం డివిజన్ లో 41392 మంది నిరుపేద లబ్ధిదారులు వుండగా వీరికి ఒక వెయ్యి 28 ఎకరాలలో ని 417 లే అవుట్ లలో ప్లాట్లు తయారు చేసి పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. అమలాపురం మండలంలో మొత్తం 3200 మంది లబ్ధిదారులు వున్నారని,ఒక్క బండారు లంక లోనే 475 మంది లబ్ధిదారులు వుండగా వీరందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరుగుతోందని సబ్ కలెక్టర్ తెలియ చేసారు.  అనంతరం మంత్రి నడిపూడి లో 124  మంది లబ్ధిదారులకు,పాలగుమ్మి లో 125మంది లబ్ధిదారులకు,పేరూరు లో 384 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మట్టపర్తి నాగేంద్ర, చెల్లు బోయిన శ్రీనివాస్, ఏ.ఎం.సి.చైర్మన్ బొక్కా ఆదినారాయణ కుడిపూడి వేంకటేశ్వర(బాబు), బొంతు గోవింద శెట్టి, కామిసెట్టి శ్రీనివాస్, పిచ్చిక ప్రభాకర్,దొంగ సునీత శ్రీను, కండెబోయిన వెంకటేశ్వరరావు, దంగేటి బుల్లి అబ్బులు, పొల మూరి బాలకృష్ణ, సరెల్ల రామకృష్ణ,నక్కా సంపత్ కుమార్,పి.కె.రావు, గొవ్వాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#