09:19 AM, 26 Friday February 2021

పోలియో రహిత సమాజం…

– అందరికీ ఆరోగ్యం…
– పల్స్ ప్రారంభించిన కమిషనర్…

మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

పోలియో నివారణకు భారత ప్రభుత్వ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తుందని మండపేట పురపాలక సంఘం కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ పేర్కొన్నారు. మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమన్ని ఆయన ప్రారంభించారు.దేశంలో 1995లో పోలీయో చుక్కలు వేయడం ప్రారంభించారన్నారు. దీనిని ప్రతి ఏడాది రెండు విడుతలుగా నిర్వహిస్తుండడంతో దేశంలో పోలియోతగ్గిపోయిందన్నారు.మండపేట టౌన్ లో5,642 మంది చిన్నారులకు చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే అన్ని కేంద్రాల్లో ఈ కార్యక్రమం ఆరంభం అయ్యిందన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు తప్పక చుక్కల మందు వేయించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ అస్మా,సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#