02:23 AM, 8 Monday March 2021

ప్రజల ఐకమత్యంతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది.

ప్రజల ఐకమత్యంతోనే గ్రామాల అభివృద్ధి
– గ్రామసభల ప్రత్యేక అధికారి సాయి కిరణ్ వెల్లడి
– మొదటి రోజు మూడు చోట్ల గ్రామసభలు నిర్వహణ

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ప్రజల ఐకమత్యంతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని గ్రామసభల ప్రత్యేక అధికారి సాయి కిరణ్ పేర్కొన్నారు. మండలంలోని రాయనపేట , గుండాల , పురుషోత్తపట్నం గ్రామసచివాలయాల పరిధిలోని ఇసుక రీచ్ ల నిర్వహణకు ప్రజల అనుమతి కోరుతూ శుక్రవారం మండల స్థాయిలోని అధికారులు గ్రామసభలు నిర్వహించారు. గ్రామసభల్లో ఆయా గ్రామాల్లోని ప్రజలు పాల్గొని సభలను విజయవంతం చేశారు. ముందుగా రాయనపేట గ్రామసచివాలయం పరిధిలోని కొత్తకొండిపల్లి రెవెన్యూ గ్రామంలో సచివాలయం కార్యదర్శి ఎస్.శ్రీనివాస్ గ్రామసభను ఏర్పాటు చేయగా పూనెం.గోపాల్ అధ్యక్షతన గ్రామసభ నూతన కమిటీని గ్రామస్తులు ఎన్నుకున్నారు. ఈ కమిటీలో గౌరవ అధ్యక్షులుగా పూనెం.గోపాల్ , ఉపాధ్యక్షులుగా కుంజా.రాము , కార్యదర్శిగా కాటిబోయిన.సారయ్య ఎన్నిక కాబడ్డారు. ఈ సందర్భంగా గ్రామసభలో పలు అంశాలపై తీర్మానాలు చేశారు. అనంతరం ప్రత్యేక అధికారి సాయి కిరణ్ మాట్లాడుతూ రాయనపేట ఇసుక రీచ్ నిర్వహణకు 11మంది సభ్యులతో వైఎస్సార్ సాండ్ లేబర్ సొసైటీ పేరిట గతంలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని దానికి ప్రస్తుతం గ్రామప్రజల అనుమతి కావాలని కోరారు. దాంతో సభలో తీర్మానం ప్రవేశపెట్టగా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే గ్రామాభివృద్ధికి సొసైటీ సహకారాన్ని అందించాలని కోరారు. అంతేకాకుండా ఇసుక రీచ్ లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తీర్మానం చేశారు. మూడు చోట్ల గ్రామసభ కమిటీలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో మొదటి రోజు గ్రామసభలు ప్రశాంతంగా ముగిశాయి. రెండవ రోజు గ్రామసభలు ఎటపాక , కన్నాయిగూడెం , గొమ్ముకొత్తగూడెం గ్రామ సచివాలయాల పరిధిలో శనివారం ఏర్పాటు చేస్తున్నట్టు ఎటపాక ఎంపిడిఓ సి.హెచ్.విఠల్ పాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎటపాక , గొమ్ముకొత్తగూడెం కార్యదర్శులు సత్య ప్రసాద్ , అయ్యన్న మరియు గ్రామవాలంటీర్లు వెంకటేష్ , నాగరాజు , గ్రామస్తులు సోయం.రామారావు , బొర్రా.రాంబాబు , చలపతి , మల్లిఖార్జున్ , వెంకటేశ్వరరావు , శ్రీను , బాబు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#