– కొండరెడ్ల సంఘం వ్యవస్థాపకుడు ముర్ల రమేష్ ఆవేదన .
– కొండరెడ్లు తమ సమస్యల సాధనకై కృషి చేయాలని పిలుపు.
– కొండరెడ్లు ను పోలవరం.పేరుతో నిండా ముంచేశారని వేదన
– పల్లెల్లో పోలవరం సమస్యలున్నాయి. ప్రభుత్వం పరిష్కరించలాని విజ్ఞప్తి.
– కొండరెడ్ల సంఘం ఆవిర్భావ దినోత్సవంలో కొండరెడ్ల సంఘం వ్యవస్థాపకుదు ముర్ల రమేష్ ఆవేదన
వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
పల్లెల్లో ఉంటూ నిత్యం పలు సమస్యలతో బాధపడే మారుమూల గిరిజన ఆదిమ జాతిలో ఒక్కటైన కొండరెడ్ల పరిస్థితి నేడు కడు దయనీయంగా మారిందని, ఇన్నాళ్లు ఉన్నదానితో సరిపెట్టుకొని అడవిని నమ్ముకొని అతవిఉత్పత్తులను సేకరించి జీవనం సాగిస్తున్న కొండరెడ్లకు నేడు కొండంత కష్టం కళ్ళ ముందు కథలాడుతుందని. నేడు వారి సమస్యను పరిష్కరించవలసిన ప్రభుత్వమే పోలవరం పేరుతో బయటకు నెట్టడానికి చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో కట్టుబట్టలతో బతుకు జీవుడా అంటూ చెట్టుకొకరు, పుట్టకొకరు వెళ్లాల్సిన పరిస్థితి ముంపు మండలాల్లో నెలకొన్నదని ఆధునిక యుగంలో కూడా కొండలపై నివసించాల్సిన పరిస్థితి నెలకొన్నదని, యుగాలు మారినా ప్రభుత్వాలు మారినా వారి అతుకుల బతుకుల మధ్య జీవనం అలాగే సాగుతుందని ఇంకా మారే పరిస్థితి లేదని నేడు పోలవరం అనే భూతంతో చెల్ల చెదురు అవుతున్నారని . వీరి సమస్యలు తీర్చే దేవుడు నేటికి కనిపించడం లేదని కొండరెడ్ల సంఘం వ్యవస్థాపకుదు ముర్ల రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సమస్యల పోరాటం కోసం ఉద్యమించి నేడు ప్రభుత్వంకు తమ సమస్యలు తెలియ జేయడానికి పల్లె పల్లెలు కదులుతున్నాయని అన్నారు. అందులో భాగమే ఆదివాసి కొండరెడ్ల సంఘం వ్యవస్తాపక గౌరవ అధ్యక్షులు ముర్ల రమేష్ సంఘం జండాను పలు గ్రామాల్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కొండరెడ్డి తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలని, కొండరెడ్లు తమ సమస్యల సాధనకై కృషి చేయాలని పిలుపునిస్తూ మండలంలోని మారుమూల కొండారెడ్డి గ్రామలైన కోటరిగొమ్ము, ఇప్పురు గ్రామాల్లో తమ జెండాను ఆవిష్కరించారు.
సంఘం ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా
జనవరి 11 ఆదివాసి కొండరెడ్ల సంఘం ఆవిర్భావం దినోత్సవం సంధర్భంగా జనవరి ౩ నుండి11 వరకు జరిగే సంబరాలలో భాగంగా పలు గ్రామాల్లో జెండా ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. . అనంతరం గ్రామాల్లో ప్రదర్శన నిర్వహించి ఆయన మాట్లాడుతు … కొండరెడ్ల అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం ప్రతి కొండరెడ్డి కృషి చేయాలని పిలుపునిచ్చారు . కొండరెడ్ల సమస్యల పరిష్కరంకోసం నిరంతరం ఆదివాసి కొండరెడ్ల సంఘం కృషి చేస్తుందన్నారు . కొండరెడ్లు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు పరిష్కరించాలని డిమండ్ చేసారు . ప్రతి గ్రామంలో మన ఆదివాసి కొండరెడ్ల సంఘాన్ని బలోపేతం చేయలని అన్నారు .పోలవరం ముంపు ప్రాంతాలలో కొండరెడ్ల సమస్యల తీవ్రంగా ఉన్నాయన్నారు .పోలవరం ప్రాజెక్టు కోసం సర్వంకోల్పోతున్న కొండరెడ్లకు ప్రభుత్వాలు న్యాయం చేయలేక పోతున్నాయన్నారు . కొండరెడ్ల సమస్యల పరిష్కరానికి ప్రజా ప్రతినిథులు , అధికారులు కృషిచేయాలని డిమండ్ చేసారు . ఈ కార్యక్రమంలో కథల రామిరెడ్డి సూట్రు పోతురెడ్డి , కటకల రామిరెడ్డి , ముర్ల రాజిరెడ్డి , కెచ్చెల పెంటారెడ్డి , కథల జనార్థన్ రెడ్డి , ముర్ల జగపతిరెడ్డి , సూట్రు అల్లిరాణి , కెచ్చెల వెంకటేశ్వరరెడ్డి , సూట్రు కామిరెడ్డి , కథల కన్నమ్మ , సూట్రు శైలేంద్రి , కెచ్చెల గణపతి రెడ్డి , సూట్రు మోహన్ రెడ్డి , ఉమ్మల దూర్గారెడ్డి , వల్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు