04:50 PM, 28 Thursday January 2021

ప్రపంచంలో ఎలక్షన్లు అన్ని దేశాలలో అవుతాయి కానీ ఆంధ్రప్రదేశ్ లో తప్ప

విశాఖపట్నం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు జరగడం అనేది ఒక నిరంతర ప్రక్రియ కానీ ఆంధ్రప్రదేశ్లో దానికి విరుద్ధంగా జరుగుతున్నది, దీనికి గల కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసమర్థతే అని *భారతీయ జనతా పార్టీ, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కాశపు. వి. వి. వి. సత్యనారాయణ* ఘాటుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఎలక్షన్ల నిర్వహణ అనేది నిరంతరంగా జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లి ఎలక్షన్ల జరక్కుండా అడ్డు పడటం అనేది ఇది చాలా విచారకరమైన అంశం అని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అనేది చాలా తక్కువగా ఉన్నది అని, స్వయంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిరోజు ప్రకటనలను వెలువరిస్తుంది. ఈ సమయంలో ఎలక్షన్లు నిర్వహణ అనేది పెద్ద క్లిష్టతరమైన అంశం ఏమీ కాదు అని తెలిపారు.
కరోనా సమయంలో రాష్ట్ర ఆదాయం పెంచుకోవడం కోసం వైన్ షాపులు మరియు రిజిస్టర్ ఆఫీస్ లను తెరిచి కరోనా కేసులు రోజుకు పది వేలు చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అని ఆయన విమర్శించారు.
నవరత్నాలు అమలు కోసం కరోనా సమయంలో కూడా ప్రభుత్వం కరోనా నియమాలను ఉల్లంఘించి కరోనా కేసులు  పెరగడానికి రాష్ట్ర యంత్రాంగమే కారణమని దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించాలని ఆయన తెలిపారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది ఒకటి ఉన్నదా, ఉంటే అది నిద్ర పోతుందా అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే కేంద్ర ఎన్నికల కమిషన్ కలగజేసుకుని రాష్ట్రంలో  ఎన్నికలు జరిగేటట్టు చూడాలని ఆయన కోరారు.
టీకా కార్యక్రమం ఒక నిరంతర ప్రక్రియ దానికి ఎలక్షన్ల నిర్వహణతో ముడిపెట్టడం సమంజసం కాదని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో స్కూల్, కాలేజీలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలు అన్ని తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్న ప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ యొక్క విధి నిర్వహణను అడ్డుకోవడం తగదని ఆయన తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు రాజ్యాంగం హోదా కలిగినటువంటి సంస్థ అని, దాని విధినిర్వహణకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి  గాని ఆటంకం కలిగించకూడదని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి హితువు పలికారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#