మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండపేట మండలం కేశవరం లో పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కు పార్టీలు, ప్రజలు సహకరించాలని రూరల్ ఎస్ ఐ పీతల దొరరాజు పేర్కొన్నారు. జిల్లాలో ఈ నెల 13 న జరిగే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రామచంద్రపురం డిఎస్పీ డి.బాలచంద్రరెడ్డి ఉత్తర్వుల మేరకు మండలంలో గల సమస్యాత్మక గ్రామమైన కేశవరం లో గురువారం సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు స్వేచ్చా ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. వివిద రాజకీయ పార్టీల నాయకులు, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.