05:24 AM, 2 Tuesday March 2021

ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ

– పిఠాపురం, ప్రతిపాడు నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన
– జేసీ (డి) కీర్తి చేకూరి

పిఠాపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జిల్లాలో తొలిద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సంబంధించి నామినేష‌న్ ప్ర‌క్రియ ఏర్పాట్ల‌ను క్షేత్రస్థాయిలో ప‌రిశీలించేందుకు జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి శుక్ర‌వారం పిఠాపురం, ప్ర‌త్తిపాడు మండ‌లాల్లో ప‌ర్య‌టించారు. విర‌వాడ‌, ప్ర‌త్తిపాడులోని నామినేష‌న్ కేంద్రాల‌ను సంద‌ర్శించారు. నామినేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగా సాగేందుకు చేసిన ఏర్పాట్ల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించారు. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప్ర‌క్రియ‌ను దిగ్విజ‌యంగా పూర్తిచేసేందుకు సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు. పోలీసు శాఖ సిబ్బందితో స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాలని సూచించారు. పూర్తిస్థాయి క‌చ్చిత‌త్వంతో నివేదిక‌ల‌ను రూపొందించి పంపాల‌న్నారు. ఏవైనా సందేహాలు వ‌స్తే వెంట‌నే ఉన్న‌తాధికారుల‌ను సంప్ర‌దించి నివృత్తి చేసుకోవాల‌ని జేసీ (డీ) కీర్తి చేకూరి అధికారుల‌కు సూచించారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#