02:27 AM, 2 Tuesday March 2021

ఫిబ్రవరి 1 నుండి అంగన్ వాడీ కేంద్రాలు

– జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

కోవిడ్-19 ప్రత్యేక పరిస్థితుల కారణంగా జిల్లాలో గత మార్చి నెల నుండి మూసివేసిన అంగన్ వాడీ కేంద్రాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల కనుగుణంగా 36 నుండి 72 నెలల వయసు చిన్నారులకు ప్రీ స్కూల్ విద్య, మద్యాహ్న భోజనం అందించేందుకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి తిరిగి తెరవాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. ఉదయం 9 గం.ల నుండి మద్యాహ్నం 1 గం. వరకూ కోవిడ్-19 భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటిస్తూ అంగన్ వాడీ కేంద్రాలను నిర్వహించాలని ఆమె సూచించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల బయట లోపల ఆరోగ్యకరమైన పరిశుబ్రవాతావరణం, శానిటైజేషన్, మాస్కుల వినియోగం విధిగా పాటించాలని ఆదేశించారు.   అలాగే గర్భిణులు, బాలింతలు, 6 నుండి 36 నెలల వయసు చిన్నారులకు ప్రస్తుతం అమలు చేస్తున్న టేక్ హోమ్ రేషన్ విధానాన్ని యథావిధిగా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ కొనసాగించాలని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#