10:25 AM, 16 Saturday January 2021

ఫిబ్రవరి 5 న తూర్పు – పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గ ఓటర్ల తుది జాబితా విడుదల

– జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఫిబ్రవరి 5 వ తేదీన తూర్పు – పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గ ఓటర్ల తుది జాబితా వెలువరించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు సిహెచ్ సత్తిబాబు తెలిపారు . శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యలయంలోని వివేకానంద సమావేమందిరంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు , కళాశాలల యాజమాన్యాలతో ఓటరు జాబితా తయారి పై సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా డిఆర్ మాట్లాడుతూ క్రైమ్స్ , అబ్జక్షన్ ఈనెల 18 వ తేదీ వరకు చేసుకోవచ్చన్నారు . ఓటర్ల జాబితా తయారీ , ఎన్నికల నిర్వహణకు తూర్పుగోదావరి జిల్లాలో 66 మంది , పశ్చిమగోదావరి జిల్లాలో 50 మంది మొత్తం 116 ఎఇఆర్ లు వున్నారన్నారు . అదే విధంగా 66 మంది తూర్పుగోదావరి జిల్లా , 49 మంది పశ్చిమగోదావరి మొత్తం 115 మంది డిజిగ్నేటెడ్ అధికారులగా గుర్తించడం జరిగిందన్నారు . 2015 ఎన్నికలో నమోదు కాబడిన ఓటర్లు తూర్పుగోదావరి జిల్లా 12,654 గాను , పశ్చిమగోదావరి జిల్లాలో 9,245 తో మొత్తం 21899 గా వున్నారన్నారు . ప్రస్తుత ఓటర్లు డ్రాఫ్టునోటిప్ కేషన్ ( 1.12.2020 ) నాటికి తూర్పుగోదావరి జిల్లా 7806 , పశ్చిమగోదావరి జిల్లా 6282 మొత్తం 14088 నమోదు అయివున్నారని డిఆర్ఓ ఉపాధ్యాయ ప్రతినిధులకు వివరించారు . ఇంకా నమోదు కావలసిన వారు ఈ నెల 18 వ తేదీ వరకు నమోదు చేసుకొనే అవకాశం వుందనీ డిఆర్ర్ సిహెచ్.సత్తిబాబు పేర్కొన్నారు . ఈ సమావేశంలో కాకినాడ ఆర్డిఓ ఏజి చిన్నకృష్ణ, పిడి మెప్మా కె.శ్రీరమణి లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#