06:36 AM, 4 Thursday March 2021

ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌గా గౌతమ్‌రెడ్డి బాధ్యతలు

విజయవాడ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

సరసమైన ధరలకు ఫైబర్‌నెట్‌ అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పి.గౌతమ్‌రెడ్డి అన్నారు. శనివారం ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు ఫైబర్‌నెట్‌ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఇంధన శాఖతో అనుసంధానం చేశామని గౌతమ్‌రెడ్డి వివరించారు. ‘సరసమైన ధరలకే ఇంటర్నెట్‌ సేవలు, కేబుల్‌, టెలిఫోన్‌ సేవలను అందించడానికి ప్రభుత్వం సమాయత్తమైంది. రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తాం. కేబుల్ వద్దనుకుంటే కేవలం ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు కూడా సామగ్రి అందుబాటులో ఉంది’ అని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#