05:36 PM, 3 Wednesday March 2021

ఫ్రెంచ్ దౌత్యవేత్తలతో ఉన్నత విద్యపై సమావేశం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఫ్రెంచ్ దౌత్యవేత్తలతో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య పోత్సాహంపై ఆన్ లైన్ సమావేశం జరిగిందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. “ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యను ప్రోత్సహించడం” అనే అంశంపై ఆన్ లైన్ సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, అధికారులు, ఆచార్యులు హాజరైయ్యారు. దీనిలో భాగంగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు హాజరై సమావేశానంతరం వివరాలను తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్య ప్రవేశాలు, పరిశోధనలు, ప్రోజెక్టులు తదితర అంశాలలో ఫ్రాన్స్ విద్యార్థులకు అవకాశాలపై ఫ్రాన్స్ దౌత్యవేత్త అధికారులు చర్చించారని చెప్పారు. ఆన్ లైన్ తరగతుల నిర్వహణ, నాక్ గుర్తింపు వంటి అంశాలపై యాప్షీ చైర్మన్ ఆచార్య హేమచంద్రరెడ్డి పలు సూచనలు చేసారని తెలిపారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఎక్కువ పాఠ్యాంశాలను ఈ-కంటెంట్ రూపంలో ఆన్ లైన్ లో పొందుపరచినందుకు అభినందించారని చెప్పారు. విశ్వవిద్యాలయ సమాచారాన్ని క్రమబద్ధికరించేందుకు సాఫ్ట్ వేర్ ను తీసుకువస్తున్నట్లు, పర్మినెంట్ పోస్టుల భర్తిల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమావేశంలో తెలియజేసారని వీసీ పెర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఆచార్యులు, అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#