10:26 AM, 16 Saturday January 2021

భారతీయ జనతాపార్టీ నరసరావుపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గా శ్రీ తాడువాయి వెంకట సతీష్

నరసరావుపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

నరసరావుపేట లోని మల్లమ్మ సెంటర్లోని బీజేపీ పట్టణ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు శ్రీ రంగిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భారతీయ జనతాపార్టీ నరసరావుపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గా శ్రీ తాడువాయి వెంకట సతీష్ ను నియమిస్తూ పార్టీ నాయకుల సమక్షంలో నియామక పత్రం ఇవ్వటం జరిగినది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రంగిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ సామాజిక మార్పుకోసం, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే శ్రీ తాడువాయి వెంకట సతీష్ ను పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గా నాయకులందరూ సూచించటం సంతోషకరమైన విషయమని ఈ పరిణామం పట్టణంలో పార్టీ పటిష్టమవటానికి,వ్యాపార వర్గాలకు,సామాజిక అంశాల మీద పోరాటం సల్పే వారికి పార్టీ చేరువవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు
భారతీయ జనతాపార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గా నియమితులైన శ్రీ తాడువాయి వెంకట సతీష్ మాట్లాడుతూ పార్టీ తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ పదవిని ఒక భాద్యతగా భావించి పార్టీ కి విధేయుడుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి స్థానిక సమస్యల పరిష్కారానికి తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని పార్టీ సిద్ధాంతాలను క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసి పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు .ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ కాకుమాను వెంకట కోటేశ్వరరావు,SC మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఇత్తడి కిరణ్,నాగసరపు బాబు,అమ్మా జిలాని,తవ్వా మల్లికార్జున్,పసుపులేటి సుబ్బారావు,మిరియాల నాగప్రసాద్ బీజేపీ బాషా,కామినేని హనుమంతరావు, చల్లా కోటేశ్వరరావు,సిద్ధు అనంత బ్రహ్మాచారి,పీరాట్ల మల్లికార్జున్ శిఖినం అనిల్ ప్రభుదాస్ తదితరులు శ్రీ తాడువాయి వెంకట సతీష్ గారికి  అభినందనలు తెలియచేసారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#