04:07 AM, 2 Tuesday March 2021

మండపేట మండలం లో వాహనాల తనిఖీ…

– చిన ద్వార పూడి లో నాటు సారా స్వాధీనం…

మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండపేట మండలం జడ్ మేడ పాడు, ఇప్పన పాడు తదితర ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. పోలిస్ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మండపేట రూరల్ ఎస్ ఐ పీతల దొరరాజు  ఈ తనిఖీ లు నిర్వహించారు. పంచాయితీ ఎన్నికల వేళ సొమ్ములు పెద్ద ఎత్తున తరలించేందుకు అవకాశాలు ఉన్న దృష్ట్యా ఈ తనిఖీ లు ముమ్మరం చేసినట్లు ఎస్ ఐ తెలిపారు. అలాగే మండలం లోని చిన ద్వార పూడి లో సారా స్థావరం పై ఆకస్మిక దాడులు నిర్వహించారు.800 లీటర్ ల నాటు సారా తయారీ కి ఉపయోగించే బెల్లం ఊట ను ధ్వంసం చేశారు. మండలం లో ఎక్కడైనా సారా తయారీ,సరఫరా,పంపిణీ చేపడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#