09:35 AM, 26 Friday February 2021

మతసామరస్యం కోసం పాటుపడడమే మహాత్ముడికి నిజమైన నివాళి…

– సిఐటియు సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మతసామరస్యం కోసం పాటుపడడమే మహాత్ముడికి నిజమైన నివాళి అని సిఐటియు జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ 73 వ వర్ధంతి సందర్భంగా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శేషబాబ్జీ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ లండన్ లో బార్ ఎట్ లా చదివి, దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష పై సత్యాగ్రహ ఉద్యమం నడిపారని పేర్కొన్నారు. తదుపరి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించి సామాన్య ప్రజలను కూడా ఉద్యమం లోకి కదిలించిన ఘనతే గాంధీజీదే అని కొనియాడారు. ఆయన జీవితమంతా మతసామరస్యం కోసం నికరంగా నిలబడ్డారని, అది నచ్చని ఆర్.ఎస్ఎస్ మతోన్మాదులే మహాత్ముడిని కాల్చిచంపారని విమర్శించారు. గాడ్సే వారసులు పాలన చేయడం వల్లనే దేశంలో శాంతి, సామరస్యం లేకుండా పోతుందన్నారు. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని గాంధీజీ పిలుపు నిచ్చారని పేర్కొన్నారు. గ్రామాల్లో కీలకం వ్యవసాయమేనని, రైతు లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుందన్నారు. అటువంటి రైతులు దేశ హితం కోరుతూ ఢిల్లీలో గత 65 రోజులు గా పోరాడుతున్నారని, ప్రతి భారతీయుడు రైతుల పోరాటానికి అండగా నిలబడాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, యూనియన్ అధ్యక్షుడు సిహెచ్. విజయ్ కుమార్ లతో పాటు వాసు, శారద, బాబ్జీ, మహేష్, తదితరులు పాల్గొన్నారు…

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#