06:03 PM, 28 Thursday January 2021

మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయవలసిన బాధ్యత కూడా మన పైనే ఉంది… మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోట త్రిమూర్తులు

మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయవలసిన బాధ్యత కూడా మన పైనే ఉంది…
మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోట త్రిమూర్తులు

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఎడ్ల పందాలు అనాది కాలంగా గ్రామాలలో క్రీడగా సాంప్రదాయంగా వస్తూ ఉన్నాయని మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. రాయవరం మండలం మాచవరం గ్రామంలో సంక్రాతిని సందర్బంగా రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలు సోమవారం ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి ఎడ్ల బండ నిర్వాహకులు పాల్గొన్నారు. దీనిని సీనియర్ మరియు జూనియర్ విభాగాలుగా కేటాయించి పోటీ నిర్వహించారు. మాచవరం చెల్లూరు మధ్య గల కంభాల దిబ్బ వద్ద ఈ పోటీలను నిర్వహించారు. మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోట త్రిమూర్తులు ఈ ఎడ్ల పందేలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్ల పందాలు అనాది కాలంగా గ్రామాలలో క్రీడగా సాంప్రదాయంగా వస్తూ ఉన్నాయి అన్నారు. ఎడ్ల పందాలు, పాల పోటీలను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఉందని త్రిమూర్తులు అభిప్రాయపడ్డారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయవలసిన బాధ్యత కూడా మన పైనే ఉందన్నారు. అనంతరం త్రిమూర్తులు ఎడ్ల పందేలను ప్రారంభించారు. ఈ పోటీల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణ, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 34 జతల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి. వీటిలో ఎనిమిది జతల ఎడ్లు సీనియర్ విభాగంలోనూ, 26 జతల ఎడ్లు జూనియర్ విభాగంలో పాల్గొన్నాయి. అయితే సీనియర్ విభాగంలో ప్రధమ బహుమతి చేకూరి రామకృష్ణ సామర్లకోట, ద్వితీయ బహుమతి మల్లారెడ్డి అన్నపూర్ణ జి మేడపాడు, తృతీయ బహుమతి రెడ్డి వీర వెంకట సత్య ప్రసాద్ అచ్చుతాపురం, చతుర్ధ బహుమతి నాలుగో బహుమతి రెడ్డి సుజాత అచ్యుతాపురం గెలుచుకోగా జూనియర్ విభాగంలో మొదటి బహుమతి వేణుగోపాల స్వామి, జన్మి గొల్లపల్లి కృష్ణాజిల్లా, ద్వితీయ బహుమతి చేకూరి రామకృష్ణ సామర్లకోట, తృతీయ బహుమతి నిమ్మకాయల రాజశ్రీ గొల్లప్రోలు, నాలుగో బహుమతి ముంగర వీర మురళీకృష్ణ చక్రధారి బంధం బహుమతులు గెలుచుకున్నాయి. వీరికి తోట త్రిమూర్తులు, మాచవరం అభ్యుదయ రైతు సంఘం సభ్యులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాబా రెడి, సత్తి వెంకట్ రెడ్డి, మల్లిడి రామారెడ్డి, సురేష్ రెడ్డి, మేడపాటి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, చంటిబాబు, నల్లమిల్లి వీర్రెడ్డి, చుట్టుపక్క గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన్యం ఆదినారాయణ, కొండ్రప్ దుర్గా ప్రసాద్ ఈ పోటీలకు సహకరించారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా గ్రామంలో జాతులు జరుపుకోవడం దానిలో భాగంగా ఎడ్ల పందాలు నిర్వహించడం మా గ్రామస్తులందరూ కి చాలా సంతోషంగా ఉంటుంది అంటూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పోటీ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామ‌ని గ్రామస్తులు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#