మన దేశ స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని రాయవరం ఎం పి డి వో ఎం శ్రీను అన్నారు.
రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని రాయవరం ఎం పి డి వో ఎం శ్రీను అన్నారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వామి వివేకానంద 157వ జయంతి పురస్కరించుకొని పరిపాలనా అధికారి ఎం. హరిక్రిష్ణ రెడ్డి అద్వర్యంలో జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిలుగా ఎం పి డి వో ఎం శ్రీను పాల్గొని మాట్లాడతూ స్వామి వివేకానంద 1863 సంవత్సరంలో కలకత్తాలో జన్మించారని అన్నారు. స్వామి పూర్తిపేరు నరేంద్ర నాథ్ దత్త అని అన్నారు. స్వామి వివేకానంద ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస అని అన్నారు. ప్రపంచ దేశాలకు భారతదేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. 127 సంవత్సరాల క్రితం చికాగో లో జరిగిన ప్రపంచ దేశాల సమ్మేళనములో భారతదేశం తరపున స్వామి పాల్గొని, తన ప్రసంగం ద్వారా ప్రపంచంలో భారత్ యొక్క గొప్ప తనాన్ని చాటారని అన్నారు.స్వామి వివేకానంద జీవితం యువతకు గొప్ప ఆదర్శమని అన్నారు. అందుకె వివేకానంద జయంతిని యువజనోత్సవ దినోత్సవం గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ప్రతీ ఒక్కరూ స్వామి వివేకానంద జీవిత చరిత్రను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తోలతగా అయన చిత్ర పటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ కే మల్లేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ మహేష్ రెడ్డి, టైపిస్ట్ ఎం కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.