05:12 AM, 3 Wednesday March 2021

మహాత్మా గాందీజీకి ఘన నివాళి

అమలాపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మహాత్మా గాంధీ 73వ వర్ధంతి సందర్భంగా శనివారం అమలాపురం రూరల్ మండలంలోని సమనస గ్రామంలో గల మహాత్మా జ్యోతిభాపూలే బిసి గురుకుల పాఠశాలలో మహాత్మా గాంధీకి చిత్రపటానికి పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై టి ఎస్ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ వై టి ఎస్ రాజు మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో అనేకమంది దేశభక్తులు, స్వాతంత్ర్య సమరయోధులు అసువులు బాసారని, జాతిపిత అయినటువంటి గాంధీజీ కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో అహింసావాదంతో తనదైన శైలిలో భారత స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేశారని, ఆయన సూచించిన అహింసావాదంలో తదనంతరం అనేకమంది జాతీయ, అంతర్జాతీయ నాయకులు తమతమ ఉద్యమాలలో అహింసతో విజయం సాధించారన్నారు.
అనంతరం 11 గంటలకు విద్యార్థులు, ఉపాద్యాయులు, పాఠశాల సిబ్బంది రెండు నిమిషాలు మౌనం వహించడం జరిగింది   ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వై టి ఎస్ రాజు, ఆనంద్, ఏటిపి ఎన్. అరుణకుమారి, ఉపాద్యాయులు, ఉపాద్యాయినీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#