11:19 AM, 28 Thursday January 2021

మాచవరం వృద్ధురాలి ఇంట్లో భారీ చోరీ

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలంలోని మాచవరం గ్రామంలో ఒక వృద్ధురాలు ఇంట్లో భారీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన కొరిపెళ్ళ సూర్యకాంతం దేవి సెంటర్ లో నివాసం ఉంటున్నారు. రాజమహేంద్రవరంలో ఉంటున్న ఆమె పెద్ద కుమార్తె కుమారుడు అమెరికా వెళుతుండటంతో సూర్యకాంతం ఈ నెల 4న రాజమహేంద్రవరం వెళ్లారు. మనుమడు అమెరికా వెళ్ళిన అనంతరం గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. అయితే ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తెరుచుకొని ఉండడంతో అవాక్కయి లోపలకి వెళ్లి పరిశీలించగా రెండు బీరువాలు తెరిచి ఉంచి బీరువా లోని వస్తువులు లన్ని క్రింద చిందరవందరగా పడి ఉండటం, బీరువాలో భద్రపరిచిన మూడు లక్షల రూపాయల నగదు, 30 గ్రాముల బంగారు నాణెం చోరీకి గురైనట్టు గా సూర్యకాంతం గుర్తించారు. వెంటనే ఆమె రాయవరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బిక్కవోలు ఎస్ ఐ పి వాసు, రాయవరం ఏ ఎస్ ఐ పి వెంకటేశ్వరరావులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. శుక్రవారం కాకినాడ నుండి వచ్చిన క్లూస్ టీం ఆధారాలు సేకరించి తీసుకుని వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#