05:39 PM, 28 Thursday January 2021

మానవత్వం చాటుతున్న విద్యావేత్త ముప్పాల.శ్రీధర్

మానవత్వం చాటుతున్న విద్యావేత్త ముప్పాల.శ్రీధర్
– మరో శ్రీమంతుడుగా ఏజెన్సీలో సామాజిక సేవలు

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండల పరిధిలోని నెల్లిపాక గ్రామ పంచాయతీలో గల గ్రామాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తు ఆయా గ్రామాల అభివృద్ధిలో భాగంగా త్రాగునీరు ,రహదారులు, విద్య , వైద్యం వంటి ఎన్నో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న ఏజెన్సీ శ్రీమంతుడు , తపస్య విద్యాసంస్థల చైర్మన్ ముప్పాల.శ్రీధర్ (హైదరాబాద్) సేవలు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లిపాక గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిధిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల ఆరోగ్య కేంద్రం నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం 1కోటి 50 లక్షల రూపాయల నిధులతో నూతన భవనాలను మంజూరు చేసింది. అయితే శిథిలావస్థకు చేరిన ఆరోగ్య కేంద్రాన్ని తొలగిస్తున్న క్రమంలో రోగులకు వైద్యం అందించేందుకు సరైన భవనం లేకపోవడంతో అటు వైద్య సిబ్బంది ఇటు రోగులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన సేవా సంస్థల గ్రామ భాగస్వామి నలజాల శంకర్రావు మరియు గ్రామస్తులు ద్వారా సమాచారం తెలియడంతో మానవత్వంతో తాత్కాలికంగా వైద్య సేవలు అందించేందుకు తపస్య విద్య సంస్థల అధినేత ముప్పాల శ్రీధర్ తన సొంత ఖర్చుతో తాత్కాలిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి షెడ్లు నిర్మించారు. ఈ తాత్కాలిక ప్రాధమిక అరోగ్య కేంద్రం కొరకు ఏర్పాటు చేసిన షెడ్లను తపస్య విద్యాసంస్థలు ఛైర్మన్ ముప్పాల శ్రీధర్ , కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎటపాక సిఐ గీతా రామకృష్ణలు ప్రారంభించారు. ఈ సందర్బంగా తపస్య విద్యాసంస్థలు ఛైర్మన్ ముప్పాల.శ్రీధర్ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో విద్య, వైద్య, ఉపాధి వంటి సేవలు అందించడానికి తాను ఎల్లప్పుడూ ముందడుగు వేస్తానని అన్నారు. సేవా దృక్పథంతో నెల్లిపాక ఆసుపత్రి వైద్యులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఆసుపత్రి నిర్మాణ దశలో ఉన్నందున వైద్యం చేయుటకు గదులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అట్టి సమస్య తమ దృష్టికి రావడంతో వెంటనే తాత్కాలిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ప్రజా సేవలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా నెల్లిపాకలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరై ఏడాది గడచినా ఎటువంటి సౌకర్యాలు లేక విద్యార్థులకు వసతి లేక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆరుబయట విద్యాభ్యాసం జరుగుతుందని , ఈ విషయాన్ని పలువురు తన దృష్టికి తీసుకు వచ్చారని తప్పకుండా కళాశాల నిర్మాణానికి సైతం తనవంతుగా సహకారాన్ని అందిస్తానని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తపస్య విద్యాసంస్థలు ఛైర్మన్ ముప్పాల.శ్రీధర్ ను ఆరోగ్య కేంద్రం వైద్యులు మరియు సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎటపాక ఎస్సై జ్వాలాసాగర్ , పి.హెచ్.సి.వైద్యులు డా.శేషారెడ్డి , గ్రామస్తులు కిలారి.వెంకటేశ్వరావు , ఏలూరి.వెంకన్న , భద్రరావు , నలజాల.శ్రీకాంత్ , దుద్దుకూరి.ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#