వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండలంలో ఈ నెల 17 న జరగబోవు గ్రామ పంచాయితీ ఎన్నికలకు శని వారం గ్రామ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థులుగా, వార్డు నెంబర్లుగా నామినేషన్ లు వేసిన అభ్యర్థులు వీరేనని ఎన్నికల అధికారులు తహశీల్ధార్ యన్. శ్రీధర్, ఎంపిడిఓ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని 11 గ్రామ పంచాయితిలో 6 పంచాయితిలకు 8 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ లు వెయ్యడం జరిగింది .అందులో ఒక్క వడ్డిగూడెం పంచాయితీకి ముగ్గురు వివిధ పార్టీల తరుపున నామినేషన్ వేశారు.
నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులు వీరే
వడ్డిగూడెం గ్రామ పంచాయితీకి సోంది రత్నకుమారి, సోడి మహాలక్ష్మి, సవలం వెంకటలక్ష్మి, సర్పంచ్ గా నామినేషన్ లు వేశారు. అదే విధంగా శ్రీరామగిరి గ్రామ పంచాయితీ నుండి పులి సంతోష్ కుమారి, రాజుపేట నుండి కురసం జానకమ్మ, జీడిగుప్ప నుండి కథల వినోద్ కుమార్, కుందులూరు నుండి తెల్లం చిన్నక్క, చిన మట్టపల్లి నుండి పైదా శ్రీను సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వెయ్యడం జరిగింది.
వార్డులకు నామినేషన్ వేసిన వార్డు నెంబర్లు వీరే
రాజుపేట పంచాయితీకి 9 వార్డుకు పోడ్త్ ల నారాయణ వడ్డిగూడెం పంచాయితీకి 6 వ వార్డుకు శివగిరి అప్పన్న, 7 వార్డుకు ముత్యాల శ్రీధర్, 14 వ వార్డుకు ముత్యాల రామారావు,శ్రీరామగిరి గ్రామ పంచాయితిలో వార్డుల వారిగా 3 వ వార్డు పులి సీతమ్మ, 4 వ వార్డు కథల సూరమ్మ,, 6 వ వార్డు కెచ్చేల వీరపురెడ్డి,7 వ వార్డు పూసం రవి వర్మ, 8 వ వార్డుకు గొంది ధారయ్య వార్డు మెంబర్లుగా నామినేషన్ లు వెయ్యడం జరిగింది.