01:22 AM, 24 Sunday January 2021

యూనివర్సల్ విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

– వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు

రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారి అనుభవాలను ఆన్ లైన్ లెక్చర్స్ రూపంలో విద్యార్థులకు అందించి వారిలో విశ్వజనీనమైన విజ్ఞానాన్ని నింపాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను మంగళవారం వీసీ పరిశీలించారు. ఇంజనీరింగ్ అడ్మిషన్లు జరుగుతున్న నేపధ్యంలో విద్యార్థులకు అవసరమైన వసతులు, వనరులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధ్యాపకులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వీసీ మాట్లాడుతూ విశ్వజనీనమైన విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించడమే విశ్వవిద్యాలయాల విధి అని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేటి కాలంలో విద్యార్థులు ఎంతో అప్ డేట్ గా ఉంటున్నారని దానికి తగిన విధంగా అధ్యాపకులు మరింత మెథోస్సును సంపాధించుకోవాలని చెప్పారు. అధ్యాపకుడు నిరంతర విద్యార్థిగా సాధన చేయాలని ప్రతీ రోజు తరగతిగదిలో గురువు కొత్త విషయాలను విద్యార్థులకు తెలియజేయాలని వాటిపై విద్యార్థులకు ఎస్సైన్మెంట్లు ఇవ్వాలని తెలిపారు. ప్రిపరేషన్ లేకుండా ఏ అధ్యాపకుడు క్లాసుకి రాకూడదని స్పష్టం చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీరింగ్ లో నిష్ణాతులైన అధ్యాపకులు, సైంటిస్టులు, మేథవులు అనేమంది ఉన్నారని వారి విజ్ఞానాన్ని, అనుభవాలను ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు అందించాలని తెలిపారు. నన్నయ విశ్వవిద్యాలయంలో విద్యాబోధనలో నాణ్యత మరింత పెరగాలని అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు ప్రిన్సిపాల్ పర్యావేక్షిస్తూ ఉండాలని చెప్పారు. విద్య పరమైన అంశాలపై తాను ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానని ఎక్కడా రాజీపడకుండా నాణ్యమైన విద్యను అందించాలని తెలియజేసారు. తరువాత క్యాంపస్ లో నూతనంగా నిర్మిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని వీసీ పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లుకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.వి.పెర్సిస్, విభాగాధిపతులు, విభాగాధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#