03:46 AM, 20 Wednesday January 2021

యేసుక్రీస్తు ప్రేమకు ప్రతిరూపం.. ఎన్.సి.సి దొర

పెనుగొండ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

యేసుక్రీస్తు ప్రేమకు ప్రతిరూపమని సాల్మన్ దొర అన్నారు.మండలంలోని జిల్లంచెర్వు గ్రామంలో గల హెచ్.సి.బాప్టిష్టు చర్చిలో రెవరెండు పెసల చిరంజీవిరావు నేతృత్వంలో  కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నేషనల్ క్రిష్టియన్ కౌన్సిల్ మీడియావింగ్ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తుల సాల్మన్ దొర ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి,క్రిస్మస్ సందేశం తెలిపారు.ఈ సందర్భంగా సాల్మన్ దొర ప్రసంగిస్తూ యేసును నమ్మితే ఆశీర్వదింపబడి ధన్యులవుతారన్నారు. యేసు తల్లి మరియ నమ్మింది కాబట్టి ఆశీర్వదింపబడి లోకరక్షకునికి జన్మనిచ్చి ధన్యురాలు అయిందన్నారు.యేసుక్రీస్తు ప్రేమతో ప్రపంచాన్ని జయించాడన్నారు.యేసు ఆదర్శాలను స్ఫూర్తిగా చేసుకోవాలని,ఇతరుల పట్ల ప్రేమతో స్నేహభావంగా ఉండాలని ఆకాంక్షించారు.సమాజంలో ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా సేవాభావం, ప్రేమ,మానవత్వం కలిగి ఉండి ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. కరోనా సెకెండ్ వేవ్ సందర్భంగా మరింత జాగ్రత్తలు చేపట్టి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో  చర్చి ఫాష్టర్.పి.రాజేష్ కుమార్, చర్చి కమిటీ సభ్యులు పిల్లి రాజు,జయరాజు,కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#