03:06 AM, 20 Wednesday January 2021

యేసుప్రభువు లోకరక్షకుడు..డాక్టర్ దీనకుమారి

రావులపాలెం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

యేసుప్రభువు కుల,మత,జాతి భేదం లేని నిజమైన లోకరక్షకుడని రెవరెండు,డాక్టర్.దీనకుమారి, అన్నారు.రావులపాలెం మండలం, రావులపాడు గ్రామంలో దైవసేవకురాలు సత్యాల.దయకుమారి ఏర్పాటుచేసిన క్రిస్మస్ వేడుకలకు భీమవరం, పి.పి.ఎం చర్చి నుండి వచ్చిన రెవరెండు,డాక్టర్ దీనకుమారి ముఖ్య వర్తమానికులుగా పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు.చల్లని సాయం సంధ్య వేళలో కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ,ప్రతి ఒక్కరూ సోదరభావాన్ని పెంపొందించుకుని సంతోషంగా ఉండాలన్నారు. శాంతికి సంకేతమైన క్రీస్తు జననం,ఆయన జీవితం,తర్వాత సిలువ మరణం ద్వారా లోకానికి శాంతి స్వర్గ మార్గాన్ని చూపారన్నారు.పరిశుధ్ధగ్రంధం మత గ్రంథము కాదనీ, మంచికి మార్గమైనా ప్రేమ,దానం,సేవ మానవతతో నడుచుకోవాలని చెబుతున్నాయన్నారు. అనంతరం చిన్నారులు యువత చేసే ప్రత్యేకమైన గీతాలు ఆలపించగా ఏసుక్రీస్తు పుట్టిన రోజుకి సూచికగా కేక్ కట్ చేసి,ప్రేమ విందు ఏర్పాటు చేశారు.అమలాపురం దైవసేవకులు స్వరూప్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా,పాస్టర్ జీవన్ కుమార్,నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల సాల్మన్ దొర,యువ పారిశ్రామికవేత్త కుమార్ రాజా, చిన్నారులు,యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#