02:41 AM, 20 Wednesday January 2021

యేసు మార్గం ఆదర్శనీయం

వీసీ ఆచార్య మొక్క జగన్నాథరావు

రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

యేసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో పయనించి భూలోకంలో జీవితాన్ని కొనసాగించాలని, ఏసు మార్గం ఆదర్శనీయమని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. గురువారం విశ్వవిద్యాలయంలో అంతర్జాల క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి, పిఆర్ఓ పువ్వుల ఆనంద్ కోఆర్డినేటర్ వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ ఆచార్య మొక్క జగన్నాథరావు హాజరై ఉపన్యసించారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలేను, ప్రయాసపడి భారం మోయు సమస్త జనులారా నా యొద్దకు రండి అంటూ యేసు క్రీస్తు చూపిన శాంతి సత్య బోధలు లోకానికి వెలుగు గా నిలిచాయని అన్నారు. యేసు మాటలు నేటి ప్రపంచానికి ఎంతో అవసరమని, ఆయన ప్రేమ శాంతి దయ విధేయత వంటి లక్షణాలు మానవులందరూ కలిగి ఉండాలని తెలిపారు. క్రిస్మస్ ప్రపంచంలోని అన్ని దేశాల వారు జరుపుకునే గొప్ప వేడుక చెప్పారు. కోవిడ్ కారణంగా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సహకారంతో ఆన్లైన్ లో క్రిస్మస్ వేడుక జరుగుతుందని అన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రిజిస్టర్ ఆచార్య బట్టు గంగారావు మాట్లాడుతూ యేసు క్రీస్తు లోక రక్షకుడిగా భూలోకానికి వచ్చి మానవులకు మార్గదర్శకంగా నిలిచి పరలోకానికి వెళ్లారని ఆయన మార్గాలను అనుసరించి నడుచుకోవాలని సూచించారు. ఎలైవ్ గాస్పల్ క్రిస్టియన్ బ్యాండ్ వారు ప్రత్యేక క్రిస్మస్ గీతాలను ఆలపించారు. ముఖ్య వాక్యోపదేశకులు గా రెవరెండ్ డాక్టర్ నోవా ఎన్ ఆర్ డి క్రిస్మస్ ఆరాధన  నిర్వహించారు. ఏసు క్రీస్తు ప్రభువు బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని  తెలిపారు. కోవిడ్ కాలంలో ఎన్నో ఇబ్బందులను ప్రపంచం ఎదుర్కొందని నేడు నూతన సంవత్సరంలో అటువంటి సమస్యల నుండి ప్రభువు కాపాడాలని ప్రార్థించారు. రెవ. కృపా విల్సన్ శిరింగి ముగింపు ప్రార్థన చేసి క్రిస్మస్ దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు, ప్రత్యేకాధికారులు ఆచార్య కొట్టి శ్రీ రమేష్, ఆచార్య టి. అశోక్, ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎస్.టేకి, డా.వి.పెర్సిస్, కోఆర్డినేటర్ ఎన్.ఎస్.ఎస్ డా.బి.కెజియారాణి, కోఆర్డినేటర్, యూజీసీ డా.పి.విజయనిర్మల, డా.డి.కళ్యాణి, డా.పి.వెంకటేశ్వరరావు, డా. తలారి వాసు, నందెపు నాగేంద్రరావు మరియు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#