02:52 AM, 8 Monday March 2021

యోగి వేమన పద్యాలు యువతకు ఎంతో స్ఫూర్తి

ఆలమూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండల పరిధిలో జొన్నాడ గ్రామంలో యోగి వేమన జయంతి వేడుకలను ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి (దొరబాబు) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జొన్నాడ గ్రామంలో ఏర్పాటు చేసిన యోగివేమన శిలా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగివేమన వ్రాసిన పద్యాలు యువతకు ఎంతో స్ఫూర్తి ని ఇస్తాయని, అలాగే వేమన చెప్పిన మాటలు వేదాల సారాంశంగా చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. అనంతరం స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి అప్పా రెడ్డి, తాడి నాగ మోహన్ రెడ్డి, నల్లమిల్లి రామారెడ్డి, గొలుగూరి సూరెడ్డి, తాడి మెహర్ ఆదిత్య రెడ్డి, తాడి వెంకన్నబాబు పలువురు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#