03:10 AM, 24 Sunday January 2021

రామతీర్థం ఘటనపై బాధ్యులను శిక్షించాలి

అంబాజీపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఇటీవల హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు చేసి విగ్రహం చేసినవారిని కఠినంగా శిక్షించాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రతినిధి చవ్వాకుల జాన్ మోజెస్, ఏపీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  గౌరవ అధ్యక్షులు బిషప్ జల్లి జార్జి పఫప్ లు  అన్నారు. అంబాజీపేట స్థానిక ఎడ్ల బజార్ లో ఉన్న  క్రిస్టియన్ ప్రేయర్ హౌస్ నందు జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేవాలయాలు , రామాలయాలు  విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని ఏ మతస్తులు వారినైనా కఠినంగా శిక్షించాలని అన్నారు. మన లౌకిక రాజ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు . అందరూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ మనుగడ సాగించాలి  అని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం,  దేశం కోసం , ప్రపంచశాంతి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ చర్చ్ పాస్టర్స్ అసోసియేషన్ ముఖ్య కార్యదర్శి రెవ  డాక్టర్  జల్లి విక్టర్ కుమార్, పాస్టర్ పి. ప్రభు రాజేష్, మరపట్ల ప్రదీప్ కుమార్, దొండపూడి చిరంజీవి, పెదపూడి ప్రదీప్ కుమార్, దొండపూడి విజయ్ కుమార్, మమ్మిడివరపు మున్న, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#