02:00 AM, 8 Monday March 2021

రామ మందిర నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలి.

ఆలమూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రామమందిర నిర్మాణానికి హిందువులందరూ భాగస్వామ్యం కావాలని తూర్పుగోదావరి జిల్లా ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ కర్రి శ్రీనివాస్  కార్యవర్గ సభ్యులు మోహనకృష్ణ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల చొప్పెల్ల గ్రామంలో ఆలమూరు మండల  భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి స్వామి ఆరెస్సెస్ కార్యకర్తలు సూరపరెడ్డి సత్యకృష్ణ, పోతుల చంద్ర మోహన్ తో కలిసి రామమందిర నిర్మాణానికి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల హిందువులందరూ అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ రామమందిరం నిర్మాణానికి వంద ఎకరాల విస్తీర్ణంలో దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ నిర్మాణానికి ఆలమూరు మండలం నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ప్రతి గ్రామంలో విరాళాల సేకరణలో భాగస్వామ్యులు అవ్వాలని వారు అన్నారు. జనవరి 15వ తేదీ నుంచి ప్రారంభించిన  సేకరణ 30వ తేదీ వరకు విరాళాల సేకరణకు జిల్లా వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ జన్మ భూమి తీర్థక్షేత్ర కరపత్రాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో హరేరామ హరేకృష్ణ భజన బృందం, శ్రీ రామ భక్తులు ఏడిద కృష్ణమాచార్యులు, మురుకొండ సూరిబాబు, ఏడిద బుజ్జి రావు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#