రాయనపేటను ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా
– రెబల్ సర్పంచ్ బొర్రా.అలివేలు
ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
రాయనపేట పంచాయతీకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఎటపాక మండలంలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఆదివాసీ జెఏసి మరియు టిడిపి బలపర్చగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి భారీ మెజారిటీతో గెలుపొందిన రెబల్ సర్పంచ్ బొర్రా.అలివేలు పేర్కొన్నారు. మహాత్మా గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా రాయనపేట పంచాయతీ ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో ఈ ఎన్నికల్లో సర్పంచ్ గా ఎన్నుకున్నారని , వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆమె అన్నారు. పంచాయతీలోని సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించిన్నప్పుడే ప్రజా నాయకురాలుగా గుర్తింపు వస్తుందని , తనను ఆదరించిన గ్రామపంచాయతీ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి వుంటానని ఆమె పేర్కొన్నారు. పంచాయతీని అన్నివిధాలా అభివృద్ధి చేసి మండలంలోనే ప్రజా సమస్యలు లేని ఆదర్శ పంచాయతీగా గుర్తింపు తీసుకువస్తానన్నారు. తన వెన్నంటి ఉండి గెలుపు దిశగా నడిపించిన నాయకులు పూనెం.గోపాల్ , సోయం.రామారావు , మల్లిఖార్జున్ , ఏపూరి.వెంకటేశ్వరరావు , గోలి.శ్రీను , బొర్రా.రాము , దుద్దుకూరి.నవీన్ తదితరులకు మరియు మీడియా అన్నదమ్ములకు , గ్రామస్తులకు పేరు పేరునా ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.