09:26 AM, 5 Friday March 2021

రాయనపేట పంచాయతీలో రెబల్ అభ్యర్థి ఇంటింటి విస్తృత ప్రచారం

రాయనపేట పంచాయతీలో రెబల్ అభ్యర్థి విస్తృత ప్రచారం
 – సర్పంచ్ అభ్యర్థి బొర్రా.అలివేలు విజయాన్ని కాంక్షిస్తూ
– యూత్ నాయకులు పూనెం.గోపాల్ , బొర్రా.రాంబాబుసారధ్యంలో

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఈ నెల 17న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాయనపేట రెబల్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొర్రా.అలివేలు విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక నాయకులు , గ్రామస్తులతో ఆదివారం యూత్ నాయకులు పూనెం.గోపాల్ , బొర్రా.రాంబాబు సారధ్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పంచాయతీ పరిధిలోని రాయనపేట , తాటాకులగూడెం , మంగువాయి , పాతకొండిపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నాయకులు ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లనుద్దేశించి వారు మాట్లాడుతూ రాయనపేట గ్రామాభివృద్ధి కోసం రెబల్ సర్పంచ్ అభ్యర్థి అలివేలుకు అధికారులు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. గతంలో రాయనపేట పంచాయతీలో పరిపాలన చేసిన ఏ ఒక్క నాయకుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులను చేపట్టలేదని , అభివృద్ధినే గాలికి వదిలేశారని వారు దుయ్యబట్టారు. ఏళ్ళు గడిచినా రాయనపేట పంచాయతీలో అభివృద్ధి మాత్రం శూన్యంగానే మిగిలిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకోసం రానున్న పంచాయతీ ఎన్నికల్లో రెబల్ సర్పంచ్ అభ్యర్థి బొర్రా.అలివేలును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని , తద్వారా పంచాయతీలో అభివృద్ధి జరుగుతుందని వారు స్పష్టంచేశారు. దానికొరకు స్థానిక నాయకులు , కార్యకర్తలు సమిష్టిగా సర్పంచ్ గెలుపు కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుంజా.శారద , కుంజా.రామచంద్రయ్య , గోలి.శ్రీనివాస్ , గోలి.సురేష్ , లకుమళ్ళ.పెదబాబు , నెర్రబోయిన.శ్రీనివాస్ , అన్నపూర్ణ , పెనుబల్లి చలపతి , తెల్లం.దుర్గ , కాటిబోయిన లక్ష్మయ్య , సారయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#