04:20 PM, 7 Sunday March 2021

రాయవరం చేరుకున్న రైస్ వాహనాలు….

రాయవరం చేరుకున్న రైస్ వాహనాలు…*
*ఫిబ్రవరి 1 నుండి ఇంటి వద్దకే రేషన్ సరుకుల " వాహనాలు*
*రాయవరం తాసిల్దార్ కె జె ప్రకాష్ బాబు*

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

లబ్ధిదారుల ఇంటి వద్దకు రేషన్ సరుకులను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన వాహనాలు రాయవరం తాసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో గురువారం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో రాయవరం మండలానికి కేటాయించిన పదమూడు వాహనాలు మండల కార్యాలయాలకు చేరుకున్నాయి. రాయవరం తాసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వాహనాలను అధికారులు ఉంచారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి లబ్ధిదారులు అయిన ప్రతి ఒక్కరికి తమ ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యంతో పాటు, రేషన్ సరుకులను చేర వేయడానికి వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, అర్హులైన వారికి సబ్సిడీపై వాహనాలను అందజేశారు. సైరన్ శబ్దం తో రోడ్ల పై వెళుతున్న వాహనాలను చూసిన బియ్యం కార్డు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా పింఛనుదారులకు అర్హుల ఇంటివద్దకే పింఛను నగదును పంపిస్తున్న ముఖ్యమంత్రి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రేషన్ సరుకులు కూడా తమ ఇంటి వద్దకే వస్తాయన్న ఆనందంలో ప్రజలు ఉన్నారు. ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు గ్రామాలలో మరింత ఆదరణ పెరుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో తాసిల్దార్ కె జే ప్రకాష్ బాబు లబ్ధిదారులు ఉద్దేశించి మాట్లాడుతూ 13 రైసు వాహనాలు సంబంధించిన లబ్ధిదారులను రేపు ఉదయం తాసిల్దార్ కార్యాలయం వద్ద రైస్ వాహనాల పై అవగాహన కల్పించి, ట్రైల్ రన్ నిర్వహించి రైస్ కార్డులు సంబంధించి ఒక్కొక్క లబ్ధిదారు వాహనానికి ఒక విఆర్వో ఉంచి తద్వారా రైస్ కార్డు దారులకు బియ్యం ఏవిధంగా అందజేయాలి అన్న తీరుపై తర్ఫీదు ఇచ్చి గ్రామ వాలంటరీ సహాయంతో ప్రజలకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తాసిల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దారు కుసుమ విజయ రేఖ, మండలంలో ఉన్న వీఆర్వోలు, రైస్ వాహన లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#