03:57 AM, 3 Wednesday March 2021

రాయవరం లో హోరా హోరీ పోరు తప్పదు…!

– 12 గ్రామాల్లో ఫిబ్రవరి 13 న ఎన్నికలు

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

పంచాయితీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో పోలింగ్‌ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. రాయవరం మండలం లో స్థానిక వేడి రాజుకుంది.ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానం నుండి అధికారులు, ప్రజలు బయట పడ్డారు. ఆగమేఘాల పై ఎన్నికల ఏర్పాట్లు సాగుతున్నాయి. రాయవరం  మండలం లో 12 గ్రామ పంచాయతీ లకు ఫిబ్రవరి 13 న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గ్రామాల్లో సర్వత్రా ఇదే అంశంపై చర్చ సాగుతోంది.
మండలంలో రిజర్వేషన్లు ఇవే…
రాయవరం మండలం లో మొత్తం జనాభా 73 వేలు మంది కాగా ఓటర్లు మొత్తం 52,064, మంది వున్నారు. విరిలో పురుషులు 25,552, మహిళలు 26551 మంది, ఇతరలు ఒకటి వున్నారు.
నదురుబాధ, లొల్ల, వెదురుపాక  సర్పంచ్ పదవులు  జనరల్ కేటగిరీలుగా ఉన్నాయి. జనరల్ మహిళా కురకాళ్ళపల్లి, కూర్మాపురం, వి.సావరం లలో రిజర్వ్ అయ్యాయి. బిసి జనరల్ వెంటూరు, సోమేశ్వరం, బిసి మహిళా పసలపూడి, చెల్లూరు,  ఎస్ సి జనరల్ రాయవరం, ఎస్ సి మహిళా మాచవరం రిజర్వేషన్ అయ్యాయి.
ఎన్నికల టీం రెడీ….
మొత్తం మండలం లో 148 పోలింగ్ స్టేషన్ లో ఉన్నాయి.ఎన్నికల విధుల్లో 800 మంది పాల్గొంటారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒక్కో పి ఓ,ఇద్దరు ఏ పి ఓ లు ఇతర సిబ్బంది ఉంటారు. మొత్తం మండలం లో ఆరుగురు రూట్ ఆఫీసర్లు, రెండు జోనల్ ఆఫీసర్లు ఉంటారు.
మండలం లోఅత్యధిక ఓటర్లు చెల్లూరులో….
మండలం లో అత్యధిక ఓటర్లు చెల్లూరు లో వున్నారు. ఇక్కడ 8,904మంది ఓటర్లు ఉండగా అత్యల్పం గా నదురుబాధ లో 847 మంది వున్నారు. ఇక అత్యధిక మంది ఓటర్ లు ఉన్న పోలింగ్ స్టేషన్ చెల్లూరు 16 వ నెంబర్ పి ఎస్ లో వున్నారు. అత్యల్పం గా  నదురుబాధ లో 1నుండి 7 పీఎస్ లలో 78 మంది చొప్పున ఓటర్లు వున్నారు.
రాయవరం లో6,381,  మాచవరం లో 7,053 మంది, సోమేశ్వరం లో 6,866, మంది ఓటర్లు వున్నారు. లొల్ల లో 1,127, మంది, వి.సావరం లో  2,411 మంది, వెదురుపాక లో 4,309 మంది, పసలపూడి లో6,545 మంది ఓటర్లు వున్నారు. వెంటూరు లో 4,582 మంది, కురకాళ్ళపల్లి1,191 మంది, కూర్మాపురం,లో 1,848 , చెల్లూరు 8,904, నదురుబాధ లో 847 మంది ఓటర్లు వున్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#