04:41 PM, 15 Friday January 2021

రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం తలపించే విధంగా పరిపాలన సాగుతుంది

– ఇళ్ల స్థలాలు నిరంతర ప్రక్రియ
– మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి, పట్టుదలతోనే రాష్ట్రమంతటా నేడు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా సాగుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహాకార, ఫుడ్ ప్రోససింగ్ మరియు మార్కెటింగ్ శాఖామంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు పట్టాల పంపిణీలో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జగన్నాధపురం ముత్తా నగర్ సర్వేపల్లి రాధాకృష్ణ నగరపాలక సంస్థ ప్రాధమి పాఠశాల, ఘాటి సెంటర్ లో వున్న గంటి మోహన చంద్రబాలయోగి నగరపాలక ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత, స్థానిక శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్, కమీషనర్ స్వప్నల్ దినకర పుండ్కర్ లు ముఖ్యఅతిధి లుగా పాల్గొని, లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి ఆదర్శవంతంగా రాష్ట్రంలో ఊరు, వాడ వాడలలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా జరుగుతున్నాయన్నారు. ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి నాడు చెప్పిన దానికన్న, ఇస్తానన్న దానికని కంటే ఎక్కువగా, ముందుగానే నేడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, అందరి మన్ననలు పొందుతున్నారన్నారు. తండ్రి ఇచ్చిన ఆస్తికి మాత్రమే వారసుడుని కానని, ఆయన ఆశయాలకు కూడా వారసుడనని తన పరిపాలన ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఋజువు చేసారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం తలపించే విధంగా పరిపాలన సాగుతుందన్నారు. నవర్నాలు- పేదలందరికి ఇళ్లం పథకానికి సంబంధించి భూమి సేకరించిన రైతు దగ్గర నుంచి ఇంటి స్థలం పొందిన పేదవాని వరకు సంతృప్తి ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ప్రారంభంలోనే నాయకులకు, అధికార యంత్రంగానికి దిశ నిర్దేశం చేసారని ఆయన తెలిపారు. ఒక కుటుంబంలో తండ్రి లేదా సోదరుడు తన కూతురుకి, సోదరికి ఇల్లు ఆస్తిగా ఇవ్వలేని ప్రస్తుత రోజుల్లో రాష్ట్రంలో వున్న పేద అక్క చెల్లిమ్మల సొంతింటి కలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి 31 లక్షల మంది ఆడపడుచులకు ఇంటి స్థలం ఇచ్చి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మంత్రి అన్నారు. మహిళలకు, వారి భవిష్యత్ తరాల ఆస్తిగా ఇస్తున్న ఇంటి పట్టా, స్థలం నేడు సుమారు 8 నుంచి 10 లక్షలు ఖరీదు చేస్తుందని, ఎన్ని కష్టాలు ఎదురైనా దీనిని దుర్వినియోగం చేసుకోవద్దని లబ్దిదారులకు మంత్రి విజ్ఞప్తి చేపారు. జిల్లాలో పంపిణీ చేసే ఇళ్ల పట్టాల మొత్తంలో 20 శాతం కాకినాడ గ్రామీణ, పట్టణ నియోజక వర్గాల లబ్ధిదారులకు పంపిణీ చేయడం గొప్ప విశేషమన్నారు. గతంలో ఏ ప్రాంతానికి వెళ్లిన ఎస్సి, ఎస్టి, బిసీ కోలనీలు దర్శన మిచ్చేవని, కాని నేడు అన్ని వర్గాల వారిని ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలం కేటాయించి వైఎస్ఆర్ జగనన్న కోలనీ పేరుతో పెద్ద పెద్ద కోలనీలు, టౌన్ షిన్లుగా రూపు దిద్దుకోనున్నాయని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా విద్యా, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల పై దృషి కేంద్రీకరించి పరిపాలన నడుస్తుందని, ప్రభుత్వం ఇస్తున్న చక్కటి ఇంటి స్థలాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్ తరాలకు మంచి బాట వేయాలని మంత్రి కన్నబాబు ఆకాంక్షించారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ సంవత్రర కాలంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు ఒక ఎత్తైతే, పేదలందరికి ఇళ్లు పధకం మరో ఎత్తని ఆమె అన్నారు. పేదలందరికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో నిర్వహిస్తుందన్నారు. పెళ్లిళ్లు చేసుకుని 20 , 25 సంవత్సరాల నుంచి అద్దె ఇళ్లల్లో అనేక కష్టాలు పడుతున్న అక్క, చెల్లెమ్మలను చూచి రాష్ట్రంలో ఎక్కడ గృహం లేని గృహిణి ఉండకూడదనే ముఖమంత్రి దృఢ సంకల్పంతో రాష్ట్రమంతటా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. కాకినాడ పట్టణ , గ్రామీణ నియోజక వర్గాలలో సుమారుగా 61 వేల మందికి ఇంటి పట్టాల పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. కాకినాడ పట్టణాన్ని క్లీన్ సిటీగా, గ్రీన్ సిటీగా తీర్చి దిద్దడానికి అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని ఎమ్.పి తెలిపారు. స్థానిక శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు – పేదలందరికి ఇళ్ల స్థలాలు కార్యక్రమానికి సంబంధించి ఒక్క కాకినాడ పట్టణ ప్రజల కోసమే సుమారుగా 650 ఎకరాలు భూమి సేకరించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక అడ్డంకులు ఎదుర్కొని జిల్లాలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం శుభ పరిమాణమని ఆయన అన్నారు. గుండెల నిండా ఆశ వున్న సొంతిళ్లు లేక చాలా కష్టాలు అనుభవించిన మహిళలను లక్షాధికారులను చేయాలనే ఉద్దేశ్యంతోనే మహిళల పేరుమీదనే ఇంటి పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. ఇటువంటి మంచి రోజులు రాష్ట్రంలో ఇంతకుముందెన్నడు రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కమీషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా కాకినాడ జగన్నాధపురం ముత్తా నగరంలో వున్న 22 , 23 వార్డలకు సంబంధించి మొత్తం 1468 మంది లబ్ధిదారులకు, ఘాటి సెంటర్ వద్ద నున్న 24, 25, 26 వార్డులలో మొత్తం 2183 మంది లబ్ధిదారులకు మంగళవారం పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. ఇళ్ల పట్టాల ప్రక్రియ నిరంతరం జరుగుతుందని, పొరపాటున అర్హులైన పేద వారికి ఇంటిస్థలం రాకపోయిన ఆందోళన పడవలసిన అవసరం లేదన్నారు. అర్హత కలిగిన వారు తమకు దగ్గరలో వున్న వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకొన్న 90 రోజుల్లోనే ఇంటి స్థలం మంజూరు చేయడం జరుగుతుందని కమీషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ సిహెచ్ నాగనరసింహరావు, టీపీఆర్ ఓ ఇన్ – చార్జి ఏ.సామ్యూల్, వివిధ కార్పోరేషన్ల డైరెక్టర్లు , కార్పోరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#