04:31 PM, 2 Tuesday March 2021

రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటెయ్యండి
– వైసిపి జిల్లా కార్యదర్శి కొవ్వూరి.రాంబాబు , కురినాల.వెంకట్ విజ్ఞప్తి
– వైసిపి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ కోసం భారీ ర్యాలీ

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను చూసి పంచాయతీ ఎన్నికల్లో వైసిపికి పట్టం కట్టాలని వైసిపి జిల్లా కార్యదర్శి , నాయకులు కొవ్వూరి.రాంబాబు , కురినాల.వెంకటేశ్వర్లు (బుజ్జి) గ్రామప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎటపాక వైసిపి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకా.వెంకటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమంలో భాగంగా అట్టహాసంగా మండలంలోని రాజుపేట నుండి ఎటపాక వరకు సుమారు 500 మంది వైసిపి కార్యకర్తలతో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎటపాక మండల కేంద్రంలోని గ్రామసచివాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో వైసిపి సర్పంచ్ అభ్యర్థి కాకా.వెంకటేశ్వరరావు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైసిపి జిల్లా కార్యదర్శి , నాయకులు కొవ్వూరి.రాంబాబు , కురినాల.వెంకటేశ్వర్లు (బుజ్జి) మీడియాతో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ లే కీలకమని , వారే కీలకపాత్ర పోషిస్తారని , అందువల్ల సేవ చేసే వారిని ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో వైసిపి సర్పంచ్ అభ్యర్థి కాకా.వెంకటేశ్వరరావును ఆదరించాలని , తద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎటపాకలో అభివృద్ధి చేసి చూపిస్తామని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం , అభివృద్ధి రెండు కళ్ళుగా సుపరిపాలన అందిస్తున్నారని వారు పేర్కొన్నారు. కావున ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ఎన్నికల్లో వైసిపిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాకా.చిట్టిబాబు , నాయకులు ముర్రం ముత్తయ్య , సీనియర్ నాయకులు శీలం కృష్ణ , ఎటపాక యూత్ కార్యదర్శి మోతుకూరి.రాంప్రసాద్ , మండల నాయకులు బర్ల వెంకటరత్నం , మండల యూత్ నాయకులు దాసరి.నరేష్ , మాచర్ల.బాబూరావు , సంతపూరి.వెంకటేశ్వర్లు , గజ్జల.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#