06:35 AM, 4 Thursday March 2021

రెండవ రోజు నామినేషన్ లు ఇవే

వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలంలో ఈ నెల 17 న జరగబోవు గ్రామ పంచాయితీ ఎన్నికలకు ఆదివారం గ్రామ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థులుగా, వార్డు నెంబర్లుగా నామినేషన్ లు వేసిన అభ్యర్థులు వీరేనని  ఎన్నికల అధికారులు తహశీల్ధార్ యన్. శ్రీధర్, ఎంపిడిఓ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని 11 గ్రామ పంచాయితిలో రెండవ రోజు 11  పంచాయితిలకు 22 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ లు వెయ్యడం జరిగింది .అందులో ఒక్క జీడిగుప్ప పంచాయితీకి  నలుగురు వివిధ పార్టీల తరుపున నామినేషన్ వేశారు.  వార్డు మెంబర్లు 94 మంది నామినేషన్ లు వెయ్యడం జరిగింది.
గ్రామ పంచాయితీ వారిగా  సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల  సంఖ్య 
సర్పంచ్లు
వడ్డిగూడెం 2, రేఖపల్లి 2, రాజుపేట 2, శ్రీరామగిరి 1,పెదమట్టపల్లి 1, జీడిగుప్ప 4, తుమ్మిలేరు 2, రామవరం 2,కుందులూరు 2, చిన మట్ట పల్లి 3, ములకన పల్లి1 , సర్పంచిగా  నామినేషన్ లు వెయ్యడం జరిగింది.
వార్డు మెంబర్లు
అదే విధంగా  పంచాయితిలలో వార్డుల వారిగా రేఖపల్లి 12, వడ్డిగూడెం 12,రాజుపేట 6, శ్రీరామగిరి 9, జీడిగుప్ప 14, తుమ్మిలేరు 9, రామవరం 9, కుందులూరు 10, చిన మట్టపల్లి 8, ములకన పల్లి 5 గురు వార్డు మెంబర్లుగా నామినేషన్ లు రెండవ రోజు వెయ్యడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#