మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండపేట మండలం లోని 12 గ్రామ పంచాయితీ ఎన్నికల కు సంబంధించి నామినేషన్ ల ఉపసంహరణ లో భాగంగా రెండో రోజు ఆదివారం ఐదు గురు సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మరేడుబాక లో మటపర్తి వివి ఉదయ్ భాస్కర్, రాయుడు సత్తిబాబు లు నామినేషన్లు విత్ డ్రా చేశారు. తాపేశ్వరం లో విత్తనాల గౌరి, వాసంశెట్టి శ్రీ లక్ష్మి, గుబ్బల రామ దుర్గ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక వార్డులకు సంబంధించి ఆర్తమురు లో 13 మంది, ద్వారపూడి లో17, కేశవరం లో22, మరేడుబాకలో 11, పాలతోడు లో1,తాపేశ్వరం లో10, వెలగతోడు లో2, ఏడిద లో 6 వార్డుల నామినేషన్లు విత్ డ్రా అయ్యాయి. కాగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. దీంతో రంగంలో నిలిచే అభ్యర్థులు తెలనున్నారు.