03:40 AM, 3 Wednesday March 2021

రేషన్ వాహనదారులకు సీఎం జగన్ మరింత ఆదాయం కల్పించనున్నారు..

– ప్రతినెలా రూ.16 వేలకు బదులు రూ.21 వేలు చెల్లింపు

అమరావతి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

‘ఇంటింటా రేషన్‌ పంపిణీ’ కోసం వినియోగిస్తున్న మొబైల్‌ వాహనదారులకు మరింత ఆదాయం కల్పించేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

ఒక్కొక్క వాహనదారుడికీ ప్రస్తుతం అద్దె కింద రూ.10 వేలు, పెట్రోల్‌ నిమిత్తం రూ.3 వేలు, హెల్పర్‌ చార్జీల కోసం రూ.3 వేలు కలిపి నెలకు మొత్తం రూ.16 వేలు చెల్లిస్తున్నారు.

అయితే, వారు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం అద్దెను రూ.10 వేల నుంచి రూ.13 వేలకు, వాహనదారుడి సహాయకుడికి చెల్లించే హెల్పర్‌ చార్జీలను రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని నిర్ణయించింది.

పెట్రోల్‌ కోసం గతంలో మాదిరే రూ.3 వేలు చెల్లిస్తారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్కో వాహనదారుడికి నెలకు రూ.5 వేల చొప్పున అదనంగా అందుతుంది. అయితే, వాహనాన్ని శుభ్రంగా ఉంచారా లేదా అనే విషయాన్ని తహసీల్దార్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తారు.

వాహనం శుభ్రంగా లేకపోతే అదనంగా చెల్లిస్తున్న మొత్తంలో కోత విధించేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#